కాజల్ ప్రేమ కథ ఎప్పుడు మొదలైందో తెలుసా?

ప్రస్తుత కరోనా సమయంలో వరుసగా నటి నటులు పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.కొంత మంది ఇప్పటికే పెళ్లి చేసుకోగా మరికొందరు నిశ్చితార్థం చేసుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

 Do You Know When Kajal Agarwal Love Start  Kajal Agarwal, Goutham, Love Story, M-TeluguStop.com

ఇక అందులో మెగా డాటర్ నిహారిక ఉండగా.ఆ లిస్ట్ లో ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది.

ఈ నెల 31 వ తేదీన ఆమె పెళ్లి పీఠలు ఎక్కనుంది.ఇక ఈ విషయాన్నీ ఆమె మూడు రోజుల క్రితం నెట్టింట్లో బయటపెట్టగా అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

వయసు పెరుగుతున్న కొద్దీ తన అందం పెంచుకుంటూ  వస్తున్న బ్యూటీ  కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త  గౌతమ్ కిచ్లూతో ప్రేమలో ఉండగా ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో వారి ఇరువురు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.ఇటీవల కాజల్ కి గౌతమ్ కి నిశ్చితార్థం జరిగింది.

ఇక ఈ విషయాన్నీ ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా బయట పెట్టింది. ఈ నెల 31 న  ముంబాయి లో అత్యంత సన్నిహితుల మధ్య తమ పెళ్లి జరుగుతుందని కాజల్ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

ఇది ఇలా ఉండగా  కాజల్ పెళ్లి గురించి తనను ఇంతకు ముందు ప్రశ్నించగా ఎన్నడూ దానిపై స్పందించలేదు.మరి కరోనా లాక్ డౌన్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి పెళ్లి చేసుకుంటున్నట్టు బాంబ్ వేసింది.

అయితే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో తను షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఒక విషయం స్పష్టం కాగా… గౌతమ్, కాజల్ మధ్య ఏడెనిమిదేళ్ళ నుంచే స్నేహం ఉందని అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిగా మారనుందని సమాచారం.

కాజల్ అగర్వాల్ ప్రేమ ఆనాటిదా అంటూ నేటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు అందిస్తున్నారు.

అయితే ముందు ఎవరు ప్రేపోజ్ చేసారు అనే విషయం తెలియదు కానీ కాజల్ మాత్రం ఈ నెల ఆఖరిన ఓ ఇంటి కోడలుగా మారనుంది.పెళ్లి తరువాత కాజల్ అగర్వాల్ సినిమాలలో కనిపిస్తుందా లేక చెల్లి నిది అగర్వాల్ లనే సినిమాలకు దూరం అయ్యి గృహిణిగా సెటిల్ అవుతుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube