శివుడి 'అభిషేకం'లో పాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు.ఎన్నో రకరకాల అభిషేకాలు చేసి ఆ శివుని భక్తులు వేడుకుంటారు.

 Did You Know What Is The Speciality Of A Milk In Lord Shiva Abhishekam Lord Shiva, Abhishekam, Hindu Believes, Milk Speciality In Abhishekam, Hindu Rituals-TeluguStop.com

ఇన్ని రకాల అభిషేకాలు చేస్తున్నప్పటికీ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఏమిటో తెలుసా? పాలతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా ప్రసన్నులవుతారు.సోమవారం నాడు శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక, సోమవారం ఉదయం ఆ పరమశివునికి పాలతో అభిషేకం చేయడం వలన సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

అయితే చాలా మంది శివునికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు.ఆ పాలాభిషేకం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 Did You Know What Is The Speciality Of A Milk In Lord Shiva Abhishekam Lord Shiva, Abhishekam, Hindu Believes, Milk Speciality In Abhishekam, Hindu Rituals -శివుడి అభిషేకం#8217;లో పాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు తాండవం ఆడుతాడని ఎంతో మంది భక్తుల ప్రగాఢ నమ్మకం.తాండవం చేయడం అంటే విశ్వాన్ని సృష్టించడం.

ఈ విశ్వాన్ని భయంతో కూడా అంతం చేయవచ్చు.అందువల్ల ఉగ్రరూపం దాల్చి తాండవమాడుతున్న శివుని శాంతింప చేయడానికి పాలను ఎంచుకున్నారు.

పాలనే ఎందుకు అలా ఎంచుకున్నారంటే.పాలు సాత్వికాహారం కాబట్టి పాలను శాంతింప చేయడానికి అభిషేకాలలో ఎక్కువగా వాడుతుంటారు.

శివునికి అభిషేకం లో పాలను ఎందుకు వాడుతారన్న విషయం గురించి మన పురాణాలలో ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది.

దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి కాలకూట విషం ఉద్భవిస్తుంది.

ఆ విషాన్ని సేవించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలోనే నిల్వ ఉంచుకోవడం వల్ల అతని గొంతు నీలంగా మారుతుంది.అందువల్లనే ఆ పరమశివుని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు.

ఎంతో ప్రమాదకరమైన ఆ విషాన్ని శివుడు సేవించడం వల్ల ఆ సమయంలో శివుని గొంతు భగ భగ మండిపోతుంది.ఆ మంటను శాంతింప చేయడానికి దేవతలు శివుడికి పాలు పోయడం ద్వారా శాంతించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.

అందువల్ల శివుడికి అభిషేకాల లో పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

సోమవారం ఉదయం శివుడికి వివిధ రకాల పదార్థాలతో పాటు పాలతో అభిషేకం నిర్వహించడం వల్ల శివుని కృపకు పాత్రులు కాగలరు.

ముఖ్యంగా శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సిరి, సంపదలతో సంతోషంగా గడుపుతారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube