ఈ రాజకీయ నాయకురాలు ఒకప్పుడు తెలుగు హీరోయిన్ అని మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన “ఈ రోజుల్లో” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “నటి రేష్మా రాథోడ్” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె అంతకు ముందు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “బాడీగార్డ్” అనే చిత్రంతో హీరోయిన్ త్రిష స్నేహితురాలి పాత్రలో నటించినప్పటికీ ఆ పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ  అమ్మడిని  ఎవరూ గుర్తించలేదు.

 Reshma Rathore, Tollywood Actress, Bjp Party, Politician, Tollywood-TeluguStop.com

అలాగే ఈ రోజుల్లో చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కొత్తగా సినీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.

దీంతో ఇక సినిమాలకు స్వస్తి చెప్పి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది.

అయితే మొదట్లో యూత్ లీడర్ గా పార్టీలో చేరినప్పటికీ వెంటనే ఖమ్మం జిల్లా వైరా నుంచి నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. అయినప్పటికీ పట్టు విడవకుండా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని పోరాటం చేస్తూనే ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో రేష్మా దాదాపుగా 7 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.తెలుగులో ఈమె నటించిన టువంటి ఈ రోజుల్లో, లవ్ సైకిల్, జై శ్రీరామ్, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

అలాగే పలు ధారావాహికలలో కూడా నటించింది. అయితే  రేష్మ రాథోడ్ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సినిమా భవిష్యత్తుని వదులుకొని తన జీవితంలో కొంతమేర తప్పటడుగులు వేసిందని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube