ఈ సీనియర్ హీరో కొడుకు తెలుగులో హీరో అని మీకు తెలుసా...?  

తెలుగులో యంగ్ డైరెక్టర్ పివి. గిరి దర్శకత్వం వహించిన “నందిని నర్సింగ్ హోమ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి నవీన్ విజయ్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే.

TeluguStop.com - Did You Know These Young Hero Naveen Vijay Krishna Is Son Of Senior Actor Naresh

 అయితే నవీన్ విజయ్ కృష్ణ ఒకప్పటి టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో “నరేష్ కొడుకు” అని చాలా మందికి తెలియదు.నవీన్ విజయ్ కృష్ణ సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంభం నుంచి వచ్చినప్పటికీ ఎందుకో ఆశించిన స్థాయిలో సినిమా పరిశ్రమలో హీరోగా రాణించలేక పోతున్నాడు.

 దీనికితోడు సినిమా కథల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.

TeluguStop.com - ఈ సీనియర్ హీరో కొడుకు తెలుగులో హీరో అని మీకు తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే నవీన్ విజయ్ కృష్ణ తెలుగులో నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు, తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు.

కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.దీంతో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.అయితే ముందుగా నవీన్ విజయ్ కృష్ణ తెలుగులో నూతన దర్శకుడు రామ్ ప్రసాద్ రఘు దర్శకత్వం వహించిన “ఐనా ఇష్టం నువ్వు” అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ మహానటి “కీర్తి సురేష్” హీరోయిన్ గా నటించింది.

 కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.దాంతో తాజాగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ఈ క్రమంలో ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ చిత్రం కీర్తి సురేష్ కి కూడా తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నవీన్ విజయ్ కృష్ణ ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానని ఇటీవలే ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

#TollywoodMovie #Naresh #InaIshtam #TeluguSeniour #NaveenVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు