ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లెలు అని మీకు తెలుసా..?  

Adithi Agarwal, Tollywood heroine Aarthi agarwal, Tollywood former heroine, Tolywood, Heroine Sisters - Telugu Adithi Agarwal, Heroine Sisters, Tollywood Former Heroine, Tollywood Heroine Aarthi Agarwal, Tolywood

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “గంగోత్రి” అనే చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా నటించి తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ అదితి అగర్వాల్ గురించి తెలియని వారుండరు.

 Did You Know These Tollywood Heroine Is A Star Heroine Aarthi Agarwal Sister

ఈమె ఒకప్పటి టాలీవుడ్  స్టార్ హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్ చెల్లెలు అయినప్పటికీ తన కుటుంబం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకోకుండా సొంతంగా సినీ అవకాశాలు దక్కించుకుంది.కానీ ఈమె తెలుగులో నటించినటువంటి చిత్రాలలో గంగోత్రి తప్ప ఇతర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

అందువల్ల ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లెలు అని మీకు తెలుసా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే అప్పట్లో ఈ అమ్మడికి పలు సినిమా అవకాశాలు తలుపు తట్టినప్పటికీ తన వ్యక్తిగత కారణాల వల్ల నటించనని చెప్పడంతో అవకాశాల విషయంలో దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు.

అయితే అదితి అగర్వాల్ మిస్ చేసుకున్నటువంటి హిట్ చిత్రాల లిస్టులో శ్రీ ఆంజనేయం, వర్షం తదితర చిత్రాలు ఉన్నాయి.దీనికి తోడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి ఆర్తి అగర్వాల్ మృతిచెందడం, సినిమా కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడం వంటి కారణాలతో అదితి అగర్వాల్ సినిమా పరిశ్రమకి పూర్తిగా దూరమైపోయింది.

తెలుగులో అదితి అగర్వాల్ గంగోత్రి, కొడుకు, విద్యార్థి, ఏం బాబూ లడ్డు కావాలా, తదితర చిత్రాలలో నటించింది.అయితే ఈమె సినీ జీవితం పట్ల స్పందిస్తున్న కొందరు సినీ క్రిటిక్స్ ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలు అయ్యుండి కూడా సినిమాలలో సొంతంగా అవకాశాలు దక్కించుకోవడం అంటే అభినందించ దగ్గ విషయమే అయినప్పటికీ ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో అదితి అగర్వాల్ పూర్తిగా విఫలమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు.

#Tolywood #Heroine Sisters #Adithi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Know These Tollywood Heroine Is A Star Heroine Aarthi Agarwal Sister Related Telugu News,Photos/Pics,Images..