దేవతలు రాక్షసుల మధ్య హోరాహోరీగా అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడు, కల్పవృక్షం, శంఖం వంటి 14 రత్నాలు ఉద్భవించాయి.సముద్రం నుంచి శంఖం ఉద్భవించడం తో శ్రీ మహావిష్ణువు పాంచజన్య అనే శంఖాన్ని ధరించడం వల్ల శంఖానికి అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
శంఖం సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి తరువాత ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి వారసురాలిగా భావించి పూజిస్తారు.
శంఖం నుంచి వెలువడే ధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టల ఆగమనానికి ప్రతీకగా చెబుతారు.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖం పూరించాడు.కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన శంఖం అయిన దేవదత్తం అనే శంఖం పూరించి రంగంలోకి దిగి యుద్ధ వీరులుగా తిరిగి వస్తారు.
దేవదత్తం అనగా దేవుడి నుంచి పొందినదని అర్థం.
శంఖం యొక్క ఆకారాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.
1.దక్షిణావృత శంఖం: ఈ శంఖం ఎడమ చేతిలో పట్టుకొనే శంఖం.దీనిని పూజలో మాత్రమే ఉపయోగిస్తారు.
2.ఉత్తరావృత శంఖం: ఈ శంఖం మధ్యలో నోరు ఆకారాన్ని కలిగి ఉంటుంది.ఈ శంఖాన్ని పూజా సమయాలలో, లేదా ఇటువంటి మహత్తర కార్యాలను ప్రారంభించేటప్పుడు ఊదడానికి ఉపయోగిస్తారు.
3.మద్యావృత శంఖం: ఈ శంఖాన్ని కుడిచేతిలో పట్టుకుంటారు.
శంఖం లక్ష్మీదేవికి వారసురాలిగా భావిస్తారు.ఈ శంఖాన్ని కూర్మ పీఠం పై తివాచీని పరిచి దానిపై శంఖమును పెట్టి పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి.శంఖంలోకి నీరు పోసిన కొద్దిసేపటికి అది పవిత్ర గంగాజలంగా మారుతుంది కాబట్టి, శంఖంలో నీటిని పోస్తేనే తీర్థం అని నానుడి ఏర్పడింది.పూజ గది లో ఉన్న శంఖానికి పాలు, నీరు, తేనె మొదలైన వాటితో అభిషేకం చేసి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగి పోతాయి.
వాస్తు దోషం తొలగి పోవడానికి ఎర్రటి ఆవుపాలను శంఖంలో పోసి మన ఇంట్లో చల్లడం ద్వారా వాస్తు దోషం తొలగిపోవడమే కాకుండా, సకల సంపదలు కలుగుతాయి.