యూజర్లకు తెలియకుండానే వారికి ఇలా వాట్సాప్ మెసేజ్ పంపించొచ్చు తెలుసా?

ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తీసుకువస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది.ఇపుడు దాదాపు వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తిగా ఉంటుంది, కానీ ఇది నిజం.

 Did You Know That You Can Send Whatsapp Messages To Users Without Their Knowledg-TeluguStop.com

అవును, ఇక్కడ ప్రతి గడపలో ఇద్దరికంటే ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.అలా వాడుతున్న ప్రతి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ అవుతోంది.దానికి తాజా సర్వేలే సాక్ష్యం.ఇపుడు దాదాపు సాధారణమైన మేసెగింగ్ యాప్స్ దాదాపు కనుమరుగైపోయాయి.

బేసిగ్గా వాట్సాప్ మెసేజ్ లు చూడగానే ఎదుటివారు చూసినట్టు మనకు ఇక్కడ బ్లూ టిక్ కనబడుతుంది.దానివలన బ్లూ టిక్ కనిపిస్తే చదివినట్లు, కనిపించకపోతే చదవనట్లుగా అర్ధం అవుతుంది.

అయితే మీలో కొంతమంది కొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్‌లను చదివినట్లు.పంపిన వారికి తెలియకుండా ఉండాలి అనుకుంటారు కదా! అయితే దీనికోసం ఏ థర్డ్ పార్టీ యాప్ లు వాడాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? అవును, ఇపుడు దానికోసం వాట్సాప్ లోని కొన్ని సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, iOS యూజర్లు అయినా జస్ట్ ఈ కింది ట్రిక్ లను ఫాలో అయితే చాలు.ఎదుటి వారు పంపిన మెసేజ్ లను వారికి తెలియకుండా చాలా తేలికగా చదవవచ్చు, అలాగే ఆఫ్‌ లైన్‌ లో చూడ్డం ద్వారా వారికి బ్లూ టిక్ కనిపించకుండా కూడా చేయవచ్చు.

Telugu Message Tips, Apps, Whatsapp-Latest News - Telugu

1.ఇపుడు ముందుగా మీ ఫోన్ లోవాట్సాప్‌ ఓపెన్ చేసి , స్క్రీన్‌ మీద కుడిపక్క కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.

2.తరువాత సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి.అకౌంట్ లోకి వెళ్లాలి.

3.ఆ తర్వాత ప్రైవసీలోకి వెళ్ళాలి.

4.దీని తరువాత రీడ్ రీసీట్ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది.దాంతో మీరు అవతలి వారికి తెలియకుండా మెసేజ్ లను చూసుకోచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube