చింతపండు చ‌ట్నీతో రెడీ చేసిన ఈ ర‌స‌గుల్లా గురించి మీకు తెలుసా...

జనాలు చాలా మారిపోతున్నారు.వేసుకునే బ‌ట్ట‌ల ద‌గ్గ‌రి నుంచి తినే తిండి దాకా డిఫ‌రెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు.

 Did You Know That This Rasa Gulla Is Prepared With Tamarind Chutney , Rasa Gulla-TeluguStop.com

రొటీన్ అంటే బోర్ కొడుతుందంటూ వెరైటీ వంట‌కాల‌తో హోరెత్తిస్తున్నారు.ఇప్ప‌టికే చాలామంది ఇలాటి వెరైటీ రుచుల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు.

ఇప్పుడు మ‌రో కొత్త ర‌క‌మైన వంట గురించి మ‌నం తెలుసుకోబోతున్నాం.మ‌రి పెద్ద‌లు ఊరికే అన‌లేదు క‌దా పుర్రెకో బుద్ధి.

జిహ్వకో రుచి అ.దీనికి త‌గ్గ‌ట్టుగానే ఓ వ్య‌క్తి చేసిన వంట‌కం కాస్తా ఇప్ప‌డు చాలా వైర‌ల్ అవుతోంది.అదేంటో తెలుసుకుందాం.

ఓ వ్య‌క్తి త‌యారు చేసిన వెరైటీ స్వీట్‌ కమ్‌ హాట్‌ ఫుడ్ ఇప్పుడు నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

మ‌నంద‌రికీ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేనిది రసగుల్లా.దీని రుచికి ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిదే.

అయితే ర‌స‌గుల్లాను స్వీట్ గా త‌యారు చేసి తిన‌డం ఏంట‌ని అనుకున్నాడో లేక తానేదైనా వెరైటీగా ప్లాన్ చేయాల‌ని అనుకున్నాడో తెలీదు గానీ ఓ వ్య‌క్తి రెడీ చేసిన ర‌స‌గుల్లా చూస్తే ఇదేం ర‌స‌గుల్లారా బాబు అనిఇస్తుంది మీకు.అత‌ను పెరుగు, చాట్‌ మసాలాతో వేసి ముందుగా వాటిని సిద్ధం చేసుకున్నాడు.

ఆ త‌ర్వాత అందులో చింతపండు చట్నీ వేయ‌డం ఇక్క‌డ మ‌నం చూడొచ్చు.

అదేంటి చింత‌పండు చ‌ట్నీనా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా.

మీరేంటి ఇది చూసిన వారెవ్వ‌రైనా ఇలాగే షాక్ అయిపోతున్నారు.మ‌రి మ‌నోడి తెలివి అలా ఉంది.

అత‌గాడు చక్కెర పాకంలో ర‌స‌గుల్లాల‌ను నాన్చి ఆ త‌ర్వాత వాటిపై చింతపండు చట్నీ వేస్తాడు.ఆ త‌ర్వాత దానిపై పెరుగు, చాట్ మ‌సాల‌తో గార్నిష్ చేస్తాడు.

అయితే చివ‌ర్లో మ‌రోసారి అన‌గా సర్వ్‌ చేసేముందు చింతపండు చట్నీని ఆడ్ చేయ‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.ఇలా అత‌ను వెరైటీ వంట‌కాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడ‌న్న‌మాట‌.

దీన్ని చూసిన వారంతా అత‌ని ఆలోచ‌న‌కు స‌లాం కొడుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube