ఆ దేశంలో వాటికి కూడా పెన్షన్ ఇస్తారని మీకు తెలుసా..?

ఎక్కడైనా మనుషులకు పెన్షన్ ఇవ్వడం చూశాం కానీ జంతువులకు పెన్షన్ ఇవ్వడం చూశామా అయితే పోలాండ్ దేశంలో కుక్కలు, గుర్రాలకు పెన్షన్ అందిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి పెన్షన్ అందించనున్నారు.

 Did You Know That They Are Also Given A Pension In That Country Pension, State,-TeluguStop.com

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీసు అందిస్తున్న కుక్కలు, గుర్రాల కోసం ప్రత్యేకించి పెన్షన్ అందించేందుకు పోలాండ్ ప్లాన్ చేస్తోంది.మనుషుల మాదిరి కుక్కలు, గుర్రాలు సేవలనందిస్తున్నాయి సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి వాటి శ్రమను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకుంది.

స్మగ్లర్లు, దొంగల పనిపట్టడంలో పోలీసులకు సాయం చేస్తుంటాయి.కూలిపోయిన భవనాల్లో బాధితులను రక్షించడంతో పాటు స్మగ్లర్లను గుర్తించడంలో సాయపడతాయి.

Telugu Dogs, Horses, Latest-Latest News - Telugu

ప్రత్యేకించి పోలాండ్ దేశంలో పోలీస్, బోర్డర్ గార్డ్, ఫైర్ సర్వీస్‌లో పనిచేసే కుక్కలు, గుర్రాల కోసం అక్కడి దేశం సంరక్షణ అందిస్తుంది.వాటి భవిష్యత్ సంక్షేమానికి సాయం అందిస్తుంటుంది.అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ జంతువులకు అధికారిక హోదాను ఇచ్చే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.ఈ ముసాయిదా చట్టం ఈ ఏడాది చివర్లో పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది.

కొత్త చట్ట ప్రస్తుతం సర్వీసులో ఉన్న 1,200 కుక్కలను, 60 కి పైగా గుర్రాలకు వర్తించనుంది.ప్రతి ఏడాదిలో 10శాతం జంతువులు రిటైర్ అవుతాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.

కుక్కలలో ఎక్కువ భాగం జర్మన్ లేదా బెల్జియన్ షెపర్డ్స్ ఉన్నాయి.పశ్చిమ – మధ్య పోలాండ్‌లోని గియర్‌లాటోవోలో ప్రైవేటుగా నడుస్తున్న ఆశ్రయంలో 10 కుక్కలు, రిటైర్డ్ ఐదు పోలీసు గుర్రాలు ఉన్నాయి.

అందించే పెన్షన్ ద్వారా వార్సా పోలీసు స్నిఫర్ డాగ్ ఆర్బిటా హ్యాండ్లర్ పావెల్ కుచ్నియో, రిటైర్డ్ కుక్కలకు ఖరీదైన వైద్య సంరక్షణ అవసరమని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube