కుంభకర్ణుడి నిద్రకు సరస్వతి దేవి కారణం అని తెలుసా?

చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఆమె అనుగ్రహం కలగడం వల్ల చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం.

 Did You Know That Saraswati Devi Is The Reason For Kumbhakarnas Sleep-TeluguStop.com

ఈ చదువుల తల్లి క్షేత్రమైన బాసరలో ఎంతో మంది పిల్లలకు మొదటిగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.అంతేకాకుండా దుష్టశక్తులను సంహారం చేసి, సామాన్య ప్రజల కష్టాలను దూరం చేసే సరస్వతి దేవికి ఎన్నో మహిమలు ఉన్నాయి.

ఇందులో భాగంగానే రామాయణ ఇతిహాసాలలో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చు.

 Did You Know That Saraswati Devi Is The Reason For Kumbhakarnas Sleep-కుంభకర్ణుడి నిద్రకు సరస్వతి దేవి కారణం అని తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామాయణంలో లంకేశ్వరుడుని సోదరుడు అయినా కుంభకర్ణుడుకి ఒక వింత కోరిక కలిగింది.

కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించేచాలనే కోరికను పొందటానికి బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేస్తాడు.అయితే అతనికి ఇలాంటి వరమిస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు.

కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు.

కుంభకర్ణుడు తపస్సు చేయడంతో బ్రహ్మదేవునికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు.సరస్వతి దేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ… దేవి కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుంది.ఆ వరాన్ని నానుంచి పొందటానికి పట్టువదలకుండా తపస్సు చేస్తున్నాడు.

కాబట్టి లోకకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చేయమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.అందుకు సరస్వతి దేవి ఒప్పుకోవడంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు.

నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవడం తో ఎంతో ఆనందపడి తనకు అమరత్వం వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతి దేవి అతని మాటలను తారుమారు చేసి ఆరు నెలల పాటు తిండి, ఆరు నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలా చేస్తుంది.

ఈ విధంగా కుంభకర్ణుడి నిద్ర వెనుక సరస్వతి దేవి కారణమని చెప్పవచ్చు.

#Saraswathi Devi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU