రాళ్లపల్లి పెద్ద కుమార్తె రష్యాకు వెళ్తూ చనిపోయిందని తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో రాళ్ళపల్లి నరసింహారావు ఎన్నో సినిమాలలో నటించి తనదైన ముద్ర సంపాదించుకున్నారు.ఈ తరం వారికి ఈయన గురించి తెలియక పోవచ్చు కానీ ఎన్నో విజయవంతమైన సినిమాలలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

 Did You Know That Rallapallis Eldest Daughter Died On The Way To Russia-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర సంపాదించుకున్న రాళ్ళపల్లి వృద్ధాప్య సమస్యల కారణంగా గత రెండు సంవత్సరాల క్రితం కన్నుమూశారు.

రాళ్లపల్లికి ఇద్దరు అమ్మాయిలు సంతానం.

 Did You Know That Rallapallis Eldest Daughter Died On The Way To Russia-రాళ్లపల్లి పెద్ద కుమార్తె రష్యాకు వెళ్తూ చనిపోయిందని తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీరిలో పెద్దమ్మాయి “మాధురి“.మాధురి చిన్నప్పటి నుంచి పేద వారికి సహాయం చేయాలని, నలుగురు ప్రాణాలను కాపాడాలని కలలు కంటూ పెద్దయిన తర్వాత వైద్య విద్యను అభ్యసించాలని కోరిక ఉండేది.

చిన్నప్పటి నుంచి కలలుకన్న విధంగానే మాధురి వైద్య కోర్స్ చేయడానికి రష్యా బయలుదేరింది.

రష్యా వెళ్ళడం కోసం ట్రైన్ ప్రయాణం చేస్తున్న మాధురి అదే ట్రైన్ లో మృతి చెందిందని చాలా మందికి తెలియదు.

Telugu Actor Rallapalli, Actor Rallapalli Narasimha Rao, Did You Know That Rallapalli Elder Daughter Died In A Train, Died In Train, Pv Narasimharao, Ralla Palli Narasimharao Elder Daughter, Rallapalli Narasimaharao, Russia-Movie

ఆమెకు ట్రైన్ ప్రయాణంలో వైరల్ ఫీవర్ సోకడంతో సరైన సమయంలో వైద్యం అందక ట్రైన్లోనే మృతి చెందారు.ఈమె మరణ వార్త రాళ్ళపల్లిని కృంగదీసింది.మాధురి మృతదేహాన్ని ఢిల్లీ నుంచి చెన్నై తీసుకురావడం కోసం అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు సహాయం చేశారు.వైద్యురాలి నలుగురికి సేవ చేయాలని భావించిన మాధురి వైద్యం అందక చనిపోవడం ఎంతో బాధాకరం.

ఈ విధంగా తన కూతురిని పోగొట్టుకున్న నరసింహారావు తన కూతురు పై ఉన్న ప్రేమకు గుర్తుగా తన చొక్కా జోబి పై మాధురి అని రాయించుకొని చనిపోయేవరకు అదే చొక్కాలను ధరించడంతోనే ఆయన కూతురు పై ఉన్న ప్రేమ ఏంటో తెలిసిపోతుంది.

#Russia #Pv Narasimharao #Rallapalli #RallaPalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు