నిత్యా మీనన్ పై బ్యాన్ వేశారని తెలుసా.. అందుకు కారణం ఏమిటంటే?

Did You Know That Nithya Menon Was Banned Do You Know The Reason For That

టాలీవుడ్ హీరోయిన్ నిత్య మీనన్ గురించి, తన నటన గురించి అందరికి తెలిసిందే.అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

 Did You Know That Nithya Menon Was Banned Do You Know The Reason For That-TeluguStop.com

తన అందంతో యువతను ఫిదా చేసింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించింది.

చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకుంది నిత్యామీనన్.ఇదిలా ఉంటే నిత్యామీనన్ ను గతంలో బ్యాన్ వేశారు.ఇంతకు తను బ్యాన్ కావడానికి అసలు కారణమేమిటో తెలుసుకుందాం.

 Did You Know That Nithya Menon Was Banned Do You Know The Reason For That-నిత్యా మీనన్ పై బ్యాన్ వేశారని తెలుసా.. అందుకు కారణం ఏమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1998లో సినీ ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టిన నిత్య మీనన్ కన్నడ, మలయాళం, తమిళ, ఇంగ్లీష్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత 2010 లో అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తొలి నటనతోనే మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు తనకు మంచి సక్సెస్ ను అందించాయి.కొన్ని సినిమాలలో అతిథి పాత్రల్లో కూడా నటించింది.మధ్యలో కొన్ని సినిమాలు కూడా వదులుకుంది.ఇక ఈమె గతంలో మలయాళ ఇండస్ట్రీలో కొన్ని వివాదాల్లో ఇరుక్కుంది.కొంతమంది మలయాళ నిర్మాతలు నిత్యా మీనన్ గౌరవం ఇవ్వలేదని అన్నారు.

Telugu Bheemla Nayak, Malayalam, Nithya Menon, Nithyamenon, Pawan Kalyan, Tollywood-Movie

సినీ నిర్మాతలమనే కనీస గౌరవం లేకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తించిందని కొందరు నిర్మాతలు ఆరోపణలు చేశారు.ఇక తనను గతంలో కొందరు నిర్మాతలు కలవడానికి వచ్చినప్పుడు కూడా ఆమె వాళ్లని వెనక్కి పంపిందని అందుకే ఆమెను మలయాళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారని తెలిసింది.ఇక ఈ విషయం గురించి నిత్యామీనన్ అప్పుడే స్పందించింది.

Telugu Bheemla Nayak, Malayalam, Nithya Menon, Nithyamenon, Pawan Kalyan, Tollywood-Movie

ఆ నిర్మాతలు తనను కలవడానికి వచ్చినప్పుడు తను ఓ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నానని తెలిపింది.ఆ సమయంలోనే తన తల్లికి మూడవ దశలో క్యాన్సర్ ఉందని ఆ బాధతో నటన పై కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదని తెలిపింది.దాంతో ఆ సమయంలో నిర్మాతలు తనను కలవడానికి వచ్చినప్పుడు మనశ్శాంతి లేనిది వాళ్లతో ఎలా మాట్లాడగలను అని స్పందించింది.

Telugu Bheemla Nayak, Malayalam, Nithya Menon, Nithyamenon, Pawan Kalyan, Tollywood-Movie

నిజానికి వాళ్ళకి తనను తమ చిత్ర పరిశ్రమలో లేకుండా ఉండేందుకు కుట్ర చేశారని అందుకే ఈ వివాదంను సృష్టించారని తెలిపింది.ఇక అవన్నీ పట్టించుకోనని తన దారిని తాను చూసుకుంటానని తెలిపింది.ఇక ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉంది.అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమాలో పవన్ కి భార్య పాత్రలో కనిపించనుంది నిత్యామీనన్.సైకో సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ ఏడాది నిన్నిలా నిన్నిలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు నిత్య మీనన్ కు మంచి సక్సెస్ ను అందించింది.ఇక భీమ్లా నాయక్ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

#Nithya Menon #Pawan Kalyan #Bheemla Nayak #Malayalam #NithyaMenon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube