అజిత్ బిర్లా సినిమా నయనతార బికినీ వల్లే హిట్ అయ్యిందని తెలుసా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు, తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను స్టార్ హీరోలందరి సరసనా నటించి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

 Did You Know That Nayantaras Bikini Was Hit In The Ajith Billa Movie-TeluguStop.com

ఇకపోతే ఏ విషయాన్నైనా డేరింగ్ అండ్ డాషింగ్ గా తీసుకునే నయనతారకు సినీ పరిశ్రమ లేడీ సూపర్ స్టార్ , డాన్ అని కూడా పిలుస్తారు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం రెమ్యూనరేషన్ కూడా అయిదారు కోట్లకు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమెకి ఇంత పాపులారిటీ రావడానికి గల కారణం గతంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు అని చెప్పవచ్చు.నయనతార ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అజిత్ నటించినటువంటి బిర్లా సినిమాలో ఏకంగా బికినీ ధరించి ఎక్స్పోజ్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకాభిమానులు ఆశ్చర్యపోయారు.

 Did You Know That Nayantaras Bikini Was Hit In The Ajith Billa Movie-అజిత్ బిర్లా సినిమా నయనతార బికినీ వల్లే హిట్ అయ్యిందని తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నయనతార ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఈమె తర్వాత సినిమాలలో ఎక్స్పోజింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు.

ఇలా నయనతారకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా బిర్లా అని కూడా చెప్పవచ్చు.బిర్లా సినిమా నుంచి కేవలం గ్లామరస్ చిత్రాలలో మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కెరియర్ పరంగా బిజీగా ఉన్న నయనతార రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగానే డిమాండ్ చేస్తున్న సంగతి కోలీవుడ్ పరిశ్రమలో వినపడుతోంది.ఈమెను మెయింటెన్ చేయాలంటే నిర్మాతలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఇలా కెరీర్లో ఎంతో అద్భుతంగా రాణిస్తూ నయనతార నిజజీవితంలో కూడా ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి.

నయనతార మొదట్లో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయిన ఈ జంట కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి జరగలేదు.ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక గత కొంతకాలం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె వారి నిశ్చితార్థపు ఉంగరాలను చూపిస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు.అలాగే ఈ ఏడాది డిసెంబర్ 25న కేరళలోని ఒక ప్రముఖ చర్చిలో పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సమంత నయనతార ఓ సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా నయనతార నటించిన నెట్రికన్ సినిమా ఓటీటీ విడుదలయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది.కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా ఈ లేడీ సూపర్ స్టార్ అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.తన కాబోయే భర్త విగ్నేష్ శివన్ తో కలిసి వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలనుకుంటున్నాను సమాచారం.

#Ajith Billa #Ajith #Nayantara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు