ఈ జబర్దస్త్ సుధాకర్‌కు డాక్టరేట్ ఉందని మీకు తెలుసా?

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లకు మంచి గుర్తింపును అందిస్తుంది.ఈ షోకు సామాన్య వ్యక్తులుగా పరిచయమైన కొందరు కమెడియన్లు స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకొని వెండితెరపై కూడా అడుగులు పెడుతున్నారు.

 Did You Know That Jabardast Sudhakar Has A Doctorate-TeluguStop.com

ఇప్పటికే పలువురు కమెడియన్స్ వెండితెరపై కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఎన్నో ఏళ్ళ నుండి ప్రసారమవుతున్న ఈ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

ఇందులో మరో కమెడియన్ సుధాకర్ కూడా సామాన్యుడిగా వచ్చి మంచి కమెడియన్ గా నిలిచాడు.ఇదిలా ఉంటే ఈయనకు డాక్టరేట్ ఉందని చాలా వరకు ఎవరికీ తెలియదు.

 Did You Know That Jabardast Sudhakar Has A Doctorate-ఈ జబర్దస్త్ సుధాకర్‌కు డాక్టరేట్ ఉందని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరుకు చెందిన గాలిపటాల సుధాకర్ జబర్దస్త్ లో అడుగు పెట్టి సునామీ సుధాకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

అంతే కాకుండా లేడీ గెటప్స్ తో కూడా తెగ నవ్విస్తాడు.బుల్లెట్ భాస్కర్ టీమ్ లో పని చేస్తూ తన మాటలతో, కామెడీ డైలాగులతో బాగా నవ్విస్తాడు.ఇదిలా ఉంటే ఈయన డాక్టరేట్ గుర్తింపును కూడా అందుకున్నాడు.

2018లో ఈయనకు తమిళనాడులో కోయంబత్తూరు రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ను అందించింది.ఇక ఈ అవార్డు దుబాయిలో ఓ కార్యక్రమ వేడుకలో సుధాకర్ కు గౌరవంగా అందించారు.ఇంతకీ ఈయనకు ఈ అవార్డు రావడం ఏంటి అని అనుకుంటున్నారా.అసలు సంగతి ఏమిటంటే.ఈయన కళా రంగానికి సేవ చేస్తూ దేశ వ్యాప్తంగా దాదాపు 5వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడంతో రాయల్ అకాడమీ యూనివర్సిటీ సుధాకర్ నైపుణ్యతను తెలుసుకొని అతడికి డాక్టరేట్ అవార్డును అందించింది.

ఇక సామాన్యుడిగా తమలో ఒకడిగా జబర్దస్త్ షోలో తమతో పాటు పాల్గొని తమతోనే కామెడీ చేస్తున్న సుధాకర్ కు ఇంత గొప్ప గుర్తింపు రావడంతో ఆయనకు బుల్లితెర ఆర్టిస్టులు, ఆయన కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.జబర్దస్త్ కు ముందు పలు స్టేజి షోలలో కళా రంగాలకు సేవ చేస్తూ ఐదు వేల పైగా షో లలో పాల్గొన్నాడు.

సామాన్య వ్యక్తులకైనా ఎంతటి దానినైనా సాధించే సత్తా ఉంటుందని జబర్దస్త్ కమెడియన్ సుధాకర్ డాక్టరేట్ అవార్డును పొంది నిరూపించాడు.

Telugu Comiden, Doctorate, Jabardast, Sudhakar-Movie

ఈయన ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతూ తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాడు.ఇక ఈయన వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన ఇంత గొప్ప డాక్టరేట్ ను అందుకున్న కూడా ఏనాడూ ఇటువంటి గుర్తింపు అందుకున్న అని హోదాను చూపించలేదు.

ఈయన గురించి తనతో కలిసి నటిస్తున్న పలువురు కమెడియన్ లకు, జడ్జిలకు బాగా తెలుసు.ఇప్పటికి జబర్దస్త్ లో తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఇక డాక్టరేట్ అందుకున్న సుధాకర్ ను బుల్లితెర ప్రేక్షకులు కూడా తెగ పొగిడారు.మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా డాక్టరేట్ అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు సుధాకర్.

#Jabardast #Comiden #Doctorate #Sudhakar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు