మెగాస్టార్ చిరంజీవి పేరుతో మ్యాగజైన్ ఉందని మీకు తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడో అడుగు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకే టాప్ హీరో గా నిలిచాడు.

 Did You Know That Is A Magazine Name Megastar Chiranjeevi-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలతో పోటీగా దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే చిరంజీవికి ఓ మ్యాగజైన్ కూడా ఉందట.

 Did You Know That Is A Magazine Name Megastar Chiranjeevi-మెగాస్టార్ చిరంజీవి పేరుతో మ్యాగజైన్ ఉందని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్ చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.1878లో పునాదిరాళ్లు అనే సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు సినిమా విడుదలయింది.

ఈ సినిమా తర్వాత మన ఊరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య వంటి ఎన్నో సినిమాలలో నటించిన మెగాస్టార్ మొత్తానికి ఆయన ఖాతాలో 155 కి పైగా సినిమాలను నింపుకున్నాడు.కేవలం నటుడిగానే కాకుండా రాజకీయపరంగా ప్రజారాజ్యం పార్టీతో ముందుకువచ్చాడు.

ఇక కొంతకాలం నుండి రాజకీయం పట్ల అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు.ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Telugu Acharya, Chiranjeevi Magazine Details, Director Vijaya Bapineedu, Hero, Magazine, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Magazine, Ram Charan, Tollywood-Movie

చిరంజీవి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించాడు.తన నటనకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.వ్యక్తిగతంగా సేవలు చేసినందుకు కూడా పలు అవార్డులు అందుకున్నాడు.ఇక ఇదంతా పక్కనపెడితే చిరంజీవికి తన పేరు మీద మ్యాగజైన్ ఉందట.చిరంజీవికి సొంతంగా మ్యాగజైన్ ఉందన్న విషయం ఎవరికి తెలియక పోగా తెలుగు ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు చిరంజీవితో ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి స్టార్ దర్శకుడిగా నిలిచాడు.

Telugu Acharya, Chiranjeevi Magazine Details, Director Vijaya Bapineedu, Hero, Magazine, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Magazine, Ram Charan, Tollywood-Movie

చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి కారణం విజయబాపినీడు అని తెలిసింది.ఆయనకు చిరంజీవి మీద ఉన్న అభిమానంతో చిరు పేరుమీద మాసపత్రికను నడిపించాడు.అందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు మాత్రమే ఉండేది.

అలా అని అందరి హీరోల గురించి కూడా ఈ మ్యాగజైన్ రూపొందించలేదు.కేవలం చిరంజీవి మీద అభిమానంతో ఆయన గురించి, ఆయన సినిమాలు మాత్రం గురించి ప్రస్తావించడానికి చిరంజీవి మాసపత్రికను అందించాడు.

ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో కోసం కూడా ప్రత్యేకంగా మాస పత్రికలను ఎవరు అందించలేదు.

Telugu Acharya, Chiranjeevi Magazine Details, Director Vijaya Bapineedu, Hero, Magazine, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Magazine, Ram Charan, Tollywood-Movie

ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న వేదాళం రీమేక్ లో కూడా నటించనున్న ఈ సినిమాకు భోలాశంకరుని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.వీటితో పాటు బాబి దర్శకత్వంలో కూడా మరో సినిమాకు ఒప్పుకోగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

#Chiranjeevi #Ram Charan #Magazine #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు