Hrithik Roshan: మొదటి సినిమాతోనే ఆ హీరోకి 30 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని మీకు తెలుసా..?

బాలీవుడ్ డ్రీమ్ బాయ్ గా అప్పట్లో ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉన్న హృతిక్ రోషన్ ( Hrithik roshan ) అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరో.

ఈయన తన అందం అభినయంతో ఎంతోమంది కుర్రకారుని ఫిదా చేశారు.

అలాంటి హృతిక్ రోషన్ ని మొదటి సినిమాలో చూసే చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారట.ఇక విషయంలోకి వెళ్తే.

హృతిక్ రోషన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత కహో నా ప్యార్ హై ( Kaho na pyar hi ) అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ ఒక్క సినిమా లో హృతిక్ రోషన్ ను చూసి చాలామంది అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారట.

అంతేకాదు మొదటి సినిమాతోనే హృతిక్ రోషన్ కి దాదాపు 30 వేల వరకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట.అలా ఈయనను సినిమాలో చూసిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆత్రుత పడ్డారట.అలాంటి హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయసు నుండే నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె అయిన సుస్సన్నే ఖాన్ ( Sussanne khan ) తో స్నేహంగా ఉండేవాడు.

Advertisement

అలా వీరి మధ్య ఉన్న స్నేహం వయసు పెరిగే కొద్దీ ప్రేమగా మారింది.అయితే మొదట్లో వీళ్ళు తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టుకోలేదట.ఇక పెళ్లి చేసుకునే నాలుగు సంవత్సరాల ముందు ప్రేమ విషయాన్ని బయటపెట్టి నాలుగు సంవత్సరాలు ప్రేమలో ఉండి డిసెంబర్ 20,2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారట.

అయితే చిన్నప్పటినుండి ఎంతో స్నేహంగా ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో విడాకులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు