వారంలో అన్ని సార్లు శృంగారం చేస్తే ఆయుష్షు పెరుగుతుంద‌ట తెలుసా..!

శృంగారంపై ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది.పెళ్లి అయిన వారు వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మీరు రోజుకు, వారంలో ఎన్నిసార్లు సంభోగంలో పాల్గొంటున్నారని వైద్యులే అడుగుతున్నారు.

 Did You Know That Having Sex All The Time A Week Increases Life Expectancy-TeluguStop.com

కారణం ఎంటంటే శృంగారం రెగ్యులర్‌గా చేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటున్నారట.అలాంటి వ్యక్తుల ఆయుష్షు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గి మానసిక రుగ్మతలు దూరమయ్యే చాన్స్ ఉంటుందని వైద్యులు సెలవిస్తున్నారు.

కొందరైతే సెక్స్ గురించి అడిగిప్పుడు వైద్యుల ఎదుట ఓపెన్‌గా చెప్పేందుకు మొహమాట పడుతుంటారు.అలాంటి వారు భవిష్యత్‌లో త్వరగా అనారోగ్యం పాలవ్వడం, ఒత్తిడి, చిరాకు వలన డిప్రెషన్‌కు లోనై తమ ఆయుర్ధాయాన్ని చేతులారా తగ్గించుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు.

 Did You Know That Having Sex All The Time A Week Increases Life Expectancy-వారంలో అన్ని సార్లు శృంగారం చేస్తే ఆయుష్షు పెరుగుతుంద‌ట తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేవిధంగా మంచి ఫుడ్ తీసుకోవటం.కంటి నిండా నిద్రపోవడం .చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వంటికి కూడా మన ఆయుష్షును పెంచుతాయని చాలా మంది భావిస్తుంటారు కానీ, వాటితో పాటు శృంగారం కూడా అవసరమే.సరైన పద్ధతిలో శృంగారం తరచూ చేయటం వలన ఏకంగా 20 సంత్సరాల ఆయుష్షును పెంచుకోవటం సాధ్యమట.

ఇటీవల జరిపిన పలు అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.తరచూ శృంగారం చేసేవారికి మరణ ముప్పు తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది.

Telugu Depression, Immunity Power, Immuno Globulin A, Life Expectancy Increases, Life Time, Sex, Survey, Two Times In A Week-Latest News - Telugu

అలా ఎలా జరుగుతుందటే.శృంగారం అనేది ఆత్మీయ కలయికతో చేసేది.దీని వలన మానసిక బలం సిద్ధిస్తుందని.అందువల్ల ఆయుష్షు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.సెక్స్ చేసే వారిలో నిరాశ, నిస్పృహలు తగ్గిపోతాయని, దీంతో ఒత్తిడి కూడా జయించగలుతారని వెల్లడైంది.ఇది కూడా ఒక వ్యాయామం లాంటిదని పేర్కొంటున్నారు.

నిత్యం వ్యాయామం చేస్తే గుండెకు ఎలా మేలు జరుగుతుందో అదే విధంగా రెగ్యులర్‌గా శృంగారం చేస్తే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు.అందువల్ల అనారోగ్యం దరిచేరదని చెప్పారు.

Telugu Depression, Immunity Power, Immuno Globulin A, Life Expectancy Increases, Life Time, Sex, Survey, Two Times In A Week-Latest News - Telugu

ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం వారానికి ఒక్కసారి లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారం చేసే వారితో పోల్చిచూసినపుడు.వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వారి లాలాజలంలో ఇమ్యునో గ్లోబులిన్ -A మోతాదు ఎక్కువగా ఉందని.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని స్పష్టంచేశారు.కావున తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామాలతో పాటు.శృంగారం మీదా కాస్త దృష్టి సారిస్తే మందులతో కాకుండా నేచురల్‌గా ఆయుష్షును పెంచుకోవచ్చునని పలు అధ్యయనాలు వెల్లడించాయి.మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు.

ట్రై చేసి మీరే తెలుసుకోండి.

#Immuno Globulin #Immunity

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు