ఛార్మి తొలి పారితోషికం ఎంతో తెలుసా.. అప్పట్లోనే భారీ స్థాయిలో సంపాదించిందిగా!

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళు హృదయాలను దోచుకున్న ఛార్మి.

 Did You Know That Charmis First Remunertion And She Earned More On At That Time-TeluguStop.com

నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే తన తొలి పారితోషికం తనకు భారీ స్థాయి గా అనిపించింది.

2001 లో నీ తోడు కావాలి అనే సినిమాలో నటించి తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ సినిమాలో ఛార్మి నటిస్తున్నప్పుడు కేవలం 14 సంవత్సరాల వయసులో మాత్రమే ఉంది.ఆ సమయంలో తను స్కూల్లో చదువుతుండగా స్కూల్ సెలవుల సమయంలో సినిమాలపై శ్రద్ధ పెట్టేది.

 Did You Know That Charmis First Remunertion And She Earned More On At That Time-ఛార్మి తొలి పారితోషికం ఎంతో తెలుసా.. అప్పట్లోనే భారీ స్థాయిలో సంపాదించిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తమిళంలో కూడా అడుగు పెట్టగా అక్కడ కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక తెలుగులో శ్రీ ఆంజనేయం, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వీటితో పాటు పలు సినిమాలలో కూడా నటించింది.మొత్తానికి తక్కువ సమయంలో మంచి హోదాను సంపాదించుకునే ఛార్మి.2007 లో నటించిన మంత్ర సినిమాతో మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

Telugu Charmy, Heroine, Liger, Nee Thodu Kavali, Puri Jagnath, Remunertion, Toolywood, Vijay Devarakonda-Movie

ఇక ఈమె నటిగా దూరంగా ఉంటూ నిర్మాత బాధ్యతలు చేపట్టింది.అలా పలు సినిమాలకు నిర్మాతగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తన సినీ ప్రయాణం గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్మి.తన తొలి పారితోషికం గురించి కూడా తెలిపింది.

తన జీవితంలో తొలిరోజు కెమెరా ముందు నటించడం మంచి అనుభవం అని తెలిపింది.

తన మొదటి సినిమా సమయంలో తనతో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, కొందరు బాలీవుడ్ నటులు ఉండటంతో తనకు సినీ ఇండస్ట్రీ మరో ప్రపంచంలా కనిపించిందని తెలిపింది.

తనకు తన మొదటి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి అంటూ.తను చదువుకుంటున్న సమయంలో ఒకటే రోజు షూటింగ్ కి తిరిగి స్కూల్ కి పోవాలని చెప్పిన తన తల్లిదండ్రుల మాటలు గుర్తున్నాయని తెలిపింది.

తన సోదరుడు తనను ముంబైలో మెహబూబ్ స్టూడియోకు చెయ్యి పట్టుకొని మరి తీసుకెళ్లాడని తెలిపింది.

తొలి రోజు షూటింగ్ జీవితం మర్చిపోలేని జ్ఞాపకం అంటూ ఆ రోజు తను షూటింగులో పాల్గొన్నందుకు తనకు రూ.200 పారితోషకం ఇచ్చారని తెలిపింది.ఇక అదే తన మొదటి సంపాదన అంటూ తన తొలి సంపాదన చూసేసరికి కళ్ళు మెరిశాయి అని తెలిపింది.

అప్పుడే తనకు హీరోయిన్ కావాలని ఆశలు కూడా పుట్టుకొచ్చాయని ఆ తర్వాత తన ప్రయాణం జెట్ స్పీడ్ లో సాగింది అని తెలిపింది.ఇక నటిగా ప్రారంభమైన తన జీవితం నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టానని అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు నిర్మాతగా చేస్తుండగా మరిన్ని ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది.

#Charmy #Puri Jagnath #Liger #Toolywood #Thodu Kavali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు