అల్లు అరవింద్ కి నలుగురు కొడుకులు అని మీకు తెలుసా?

Did You Know That Allu Arvind Has Four Sons

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివంగత నటుడు అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో చిత్రాలలో నటించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

 Did You Know That Allu Arvind Has Four Sons-TeluguStop.com

ఇదిలా ఉండగా ఆయన వారసుడిగా అల్లుఅరవింద్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇతను సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ తెరకెక్కించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తప్పకుండా విజయాన్ని అందుకుంటాయి.అలా అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఉంటుంది.

 Did You Know That Allu Arvind Has Four Sons-అల్లు అరవింద్ కి నలుగురు కొడుకులు అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈయన స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి బావ కావడంతో ఎన్నో విషయాలలో చిరంజీవికి ఎన్నో సలహాలు ఇస్తూ ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు.ఇప్పటికీ మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ లోకి వచ్చారు.

అయితే వీరందరిలో ఒక పవన్ కళ్యాణ్  తప్ప మిగిలిన హీరోలందరూ తమ సినిమాల గురించి అల్లు అరవింద్ అభిప్రాయాన్ని తెలుసుకుంటారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లుఅరవింద్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఇతనికి ముగ్గురు కుమారులన్న విషయం మనందరికీ తెలిసిందే.

కానీ ఎవరికీ తెలియని మరొక విషయం ఏమిటంటే ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారు.

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకట్ అలియాస్ బాబి కొంతమందికి మాత్రమే పరిచయం.ఇక అల్లు అర్జున్, అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ ఇండస్ట్రీలో ఉండటం వల్ల వీరి గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలిసి ఉంటుంది.

ఇక అల్లు వెంకట్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం వల్ల చాలా మందికి ఈయన గురించి తెలియకపోవచ్చు.ఇలా వీరు ముగ్గురు కాకుండా అల్లు అరవింద్ కు మరొక కొడుకు కూడా ఉండేవాడు.

ఆ అబ్బాయి అల్లు వెంకట్, అల్లు అర్జున్ కి మధ్య పుట్టారు.తన పేరు అల్లు రాజేష్.ఇలా రాజేష్ పట్ల ఎంతో గారాబంగా ఉన్నా వీరికి ఒక రోడ్డు ప్రమాదం ఎంతో కడుపుకోతను మిగిల్చిందని చెప్పాలి.

Telugu Allu Arjun, Allu Arvind, Allu Sirish, Allu Venkat, Tollywood-Movie

అల్లు రాజేష్ ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.దీంతో ఎంతో కుమిలిపోయిన అల్లు అరవింద్ భార్య తనకు ఎలాగైనా తన కొడుకు రాజేష్ కావాలని పట్టుబట్టింది.అయితే అప్పటికే ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ అందుకు ప్రత్యామ్నాయ ఆపరేషన్ చేయించుకుని గర్భందాల్చి అల్లు శిరీష్ కి జన్మనిచ్చారు.

ఇలా అల్లుశిరీష్ జన్మించగానే చనిపోయిన రాజేష్ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులందరూ అతనిని ఎంతో గారాబం చేసి పెంచారు.ఇలా అల్లు అరవింద్ మరొక కొడుకు ఏడు సంవత్సరాల వయస్సులోనే చనిపోవడంతో ఇతని గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.

#Allu Sirish #Allu Arjun #Allu Arvind #Venkat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube