ఓ శునకం డిగ్రీ పట్టా పుచ్చుకుంది తెలుసా?

ఇక్కడ మనుషులే డిగ్రీలు పూర్తి చేయలేక నానాతంటాలు పడుతున్న వేళ, ఓ శునకం ఏకంగా డిగ్రీ పట్టా పుచ్చుకొని అందరికీ ఆశ్చర్య పరిచింది.అంతేకాకుండా తాను పొందిన డిగ్రీ సర్టిఫికెట్( Degree Certificate ) ని పట్టుకొని అందరిముందు చాలా గొప్పగా వూరేగింది.

 Did You Know That A Dog Has A Degree , Dog, Got, Deggree, Certificate, Viral Lat-TeluguStop.com

ఎలాగో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.వివరాల్లోకి వెళితే… సెటాన్ వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివిన మారియానీ అనే అమ్మాయి డిగ్రీ పూర్తవడంతో డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది.

అయితే చాన్నాళ్ల నుంచి వీల్‌చైర్‌కే మరిమితం అయింది.

అలా వున్న ఆమెకు జస్టిన్( Justin ) అనే శునకం ఎల్లప్పుడూ తోడుగా ఉండేది.తాజాగా ఆ వర్సిటీ గ్రాడ్యుయేషన్ సెర్మనీ( Varsity Graduation Ceremony ) నిర్వహించింది.ఆ వేడుకకు వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె తనతో పాటు ఆ కుక్కను కూడా తీసుకువచ్చింది.

ఆ సమయంలో యునివర్సిటీ ఇంచార్జి.ఆ శునకానికి సదరు డిగ్రీ పట్టాను అందజేశారు.

వెంటనే ఆ గౌరవ పట్టాను శునకం తన నోటితో అందుకున్నది.ఆ సమయంలో విద్యార్థులు కేరింతలు, చప్పట్లతో ఆడిటోరియంని ఓ మోత మోగించారు.

కాగా ఈ ఘటనకు చెందిన వీడియోను ఆ వర్సిటీ తన ట్విట్టర్‌లో పోస్టు చేయగా ఇంటర్నెట్ ని ఆ వీడియో షేక్ చేస్తోందని చెప్పుకోవచ్చు.ఇక డిగ్రీ పట్టా అందుకున్న శునకం అందరి మనసుల్ని దోచిందని చెప్పుకోవాలి.ఈ దృశ్యం అక్కడి స్టూడెంట్స్ తో పాటుగా నెటిజన్లను కూడా ఆకర్షిస్తోంది.అవును, ఈ దృశ్యం న్యూజెర్సీలోని సెటాన్ హాల్ యూనివర్సిటీలో చోటుచేసుకోవడం విశేషం.‘శునకం ఎప్పుడూ మనిషకి ఓ మంచి నేస్తమే’ అంటూ చాలామంది కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube