7/జి బృందావన కాలనీ హీరోయిన్ కి పెళ్ళై విడాకులయ్యాయని తెలుసా?

Did You Know That 7g Brundavana Colony Heroine Got Married And Divorced

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ సినిమాల విషయంలో ఎంత కేరింగ్ గా ఉంటారో తమ వ్యక్తిగత విషయం లో మాత్రం తొందరపాటు పడుతుంటారు.ముఖ్యంగా తమ పెళ్లిల విషయంలో మాత్రం బాగా తొందరపడి తమ జీవితాలను అతి తక్కువ సమయంలో నాశనం చేసుకుంటారు.అందులో 7 జి బృందావనకాలనీ హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే మారింది.

 Did You Know That 7g Brundavana Colony Heroine Got Married And Divorced-TeluguStop.com

2004లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 7 జి బృందావనకాలనీ.ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదల అయింది.ఇందులో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ నటీనటులు గా నటించారు.ఇక ఈ సినిమా మంచి హిట్ ను కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ కు పెళ్లి విడాకులు కూడా అయ్యాయట.

ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

 Did You Know That 7g Brundavana Colony Heroine Got Married And Divorced-7జి బృందావన కాలనీ హీరోయిన్ కి పెళ్ళై విడాకులయ్యాయని తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి సోనియా అగర్వాల్.

తన అందంతో, నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె నటిగానే కాకుండా మోడల్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఈమె 2002లో నీ ప్రేమకై అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమా కంటే ముందు ఈమె బుల్లితెర పై పలు సీరియల్ లో నటించింది.

Telugu Divorce, Marrige, Tollywood-Movie

ఆ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక ఈమె 2003లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అదే సినిమాను తెలుగులో ‘నేను’ అనే పేరుతో రీమేక్ చేశారు.ఇక 7 జి బృందావనకాలనీ సినిమా తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉండి 2006 న వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత సోనియా అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంది.ఆ తరువాత మనస్పర్థల కారణంగా వీరు 2009లో విడిపోయారు.ఈ విషయం చాలా వరకూ ఎవరికి తెలియక పోగా ఈ మధ్య మళ్ళీ ఈ విషయం గురించి నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక విడాకుల తర్వాత మళ్లీ సినిమాలలో అడుగు పెట్టాలని సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.ఆ సమయంలో పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సహాయ పాత్రలలో నటించింది.టెంపర్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది.నిజానికి ఈమె తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు ఎక్కువగా తల్లి పాత్రలలో అవకాశాలు వచ్చాయట.

కానీ తాను ఆ పాత్రలకు ఒప్పుకోలేదు అని తెలిసింది.దాంతో చిన్న చిన్న పాత్రలలో మాత్రమే నటిస్తుంది.

ఇక ప్రస్తుతం తను తన అందం పై, తన ఫిజిక్ పై బాగా శ్రద్ధ పెట్టి హీరోయిన్ పాత్రల కోసం ట్రై చేస్తుందని తెలుస్తుంది.మరి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి, తమిళ సినీ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

ప్రస్తుతం తను మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉందని తెలుస్తుంది.

#Marrige #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube