హైదరాబాద్ లో థియేటర్ కట్టాలని అనుకున్న శోభన్ బాబు.. చివరకు?

తెలుగు ప్రేక్షకులకు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు కాగా సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శోభన్ బాబు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

 Did You Know Sobhan Babu Wants To Build A Cinema Hall In Hyderabad City, Cinema-TeluguStop.com

కుటుంబ కథా చిత్రాలలో శోభన్ బాబు ఎక్కువగా నటించడం గమనార్హం.ఆంధ్రుల అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు నాటకాలు వేసి ఆ నాటకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలోనే శోభన్ బాబుగా తన పేరును మార్చుకున్నారు.

పౌరాణిక పాత్రల్లో సైతం నటించి శోభన్ బాబు నటించి నటుడిగా అంతకంతకూ ఎదిగారు.సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సాయం వల్లే తనకు మంచి పాత్రలు లభించాయని గతంలో పలు ఇంటర్వ్యూల్లో శోభన్ బాబు చెప్పుకొచ్చారు.

అయితే శోభన్ బాబు హైదరాబాద్ లో సినిమా హాలు కట్టాలని భావించగా కొన్ని కారణాల వల్ల థియేటర్ ను నిర్మించడం సాధ్యం కాలేదు.

Telugu Hall, Guru, Hyderabad, Shobhan Babu, Tollywood-Movie

మద్రాస్ నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలు హైదరాబాద్ కు వచ్చినా శోభన్ బాబు మాత్రం చెన్నై వదిలి హైదరాబాద్ కు రావడానికి ఇష్టపడలేదు.1975 సంవత్సరంలో మీటింగ్ లో మాట్లాడుతూ హైదరాబాద్ లో మంచి స్థలంను ఎంపిక చేసి థియేటర్ ను నిర్మిస్తానని శోభన్ బాబు చెప్పుకొచ్చారు.

Telugu Hall, Guru, Hyderabad, Shobhan Babu, Tollywood-Movie

అయితే అసలు కారణం తెలీదు కానీ శోభన్ బాబు మాత్రం ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.హలో గురూ అనే మూవీ తర్వాత శోభన్ బాబు సినిమాల్లో నటించలేదు.శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని స్థలాలు, భవనాలపై ఇన్వెస్ట్ చేశారు.

స్థలాలు, భవనాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను శోభన్ బాబు అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube