చిరంజీవి అందుకున్న తొలి పారితోషికం ఎంతంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానంలో కొనసాగారు.తొలి సినిమా నుండి సైరా నరసింహారెడ్డి సినిమా వరకు సినిమాసినిమాకు తన రేంజ్ ను చిరంజీవి పెంచుకుంటున్నారు.

 Hero Chiranjeevi First Remuneration, Megastar Chiranjeevi, First Remuneration, T-TeluguStop.com

చిరంజీవి గతేడాది విడుదలైన సైరా సినిమాకు దాదాపు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని సమాచారం.అయితే స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం కేవలం 1,116 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.

1978 సంవత్సరం పునాది రాళ్లు సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలైంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన ప్రతిభతో అవకాశాలను సొంతం చేసుకున్నారు.

ప్రముఖ దర్శకుడు బాలచందర్ చిరంజీవిలో కమల్ హాసన్ రజనీకాంత్ దాగున్నారని చేసిన కామెంట్ చిరు ప్రతిభకు అద్దం పడుతోంది.పునాది రాళ్లు చిరంజీవి నటించిన సినిమా అయినప్పటికీ ప్రాణం ఖరీదు అనే మరో సినిమా మొదట విడుదలైంది.

అయితే ఈ రెండు సినిమాలకు చిరంజీవి పారితోషికం తీసుకోలేదు.మనవూరి పాండవులు సినిమాకు చిరంజీవి 1,116 రూపాయలు పారితోషికం రూపంలో అందుకున్నారు.

కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో, చిన్న పాత్రల్లో నటించిన చిరంజీవి ఇమేజ్ ఖైదీ సినిమాతో పూర్తిగా మారిపోయింది.ఈ జోనర్ ఆ జోనర్ అనే తేడా లేకుండా అన్ని జోనర్లకు సంబంధించిన సినిమాలలో నటించి అభిమానులను మెప్పించిన నటుడు చిరంజీవి.

టాలీవుడ్ కు బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుందని చెప్పాలి.

చిరంజీవి పౌరాణిక సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినప్పటికీ పలు సినిమాల్లో శివుని పాత్రల్లో నటించి మెప్పించారు.

చిరంజీవికి భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినా అప్పట్లో వైయస్సార్ క్రేజ్ వల్ల ఆ పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube