కార్తీక దీపం సౌర్య ఎవరి కూతురో తెలుసా...?

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సినిమాలు తొలి టెలీకాస్ట్ లో కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్ ను అందుకోలేకపోయాయి.

 Did You Know Karthika Deepam Showrya Real Story Karthikadeepam, Shourya, Vantal-TeluguStop.com

బుల్లితెర బాహుబలిగా పిలిచే ఈ సీరియల్ తెలుగింటి ఆడపడుచుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబుల తరువాత సౌర్య పాత్ర ఆ స్థాయిలో ఆకట్టుకుంది.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పించేలా సౌర్య పాత్ర ఉంటుంది.

సౌర్య పాత్రలో నటించిన చిన్నారి పేరు గ్రంధి కృతిక.

స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో ఆ పాపను అందరూ బేబీ కృతిక అని పిలుస్తూ ఉంటారు.జీ తెలుగు ఛానెల్ లో గీతాంజలి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన సౌర్య అద్భుతమైన నటనతో వరుస అవకాశాలను అందుకుంటూ దాదాపు 15 సీరియల్స్ లో నటించింది.

ఐదేళ్ల వయస్సులోనే కృతిక బాలనటిగా యాక్టింగ్ కెరీర్ ను మొదలుపెట్టడం గమనార్హం.

సౌర్య తండ్రి పేరు వంశీ కృష్ణ.

ఈయన వృత్తిరిత్యా బిజినెస్ మేన్.కృతిక ప్రస్తుతం కార్తీకదీపంతో పాటు బావా మరదలు, అక్క మొగుడు సీరియల్స్ లో కూడా నటిస్తోంది.

నటనంటే ఎంతో ఇష్టం ఉన్న సౌర్య చదువులో కూడా ఎప్పుడూ మంచి మార్కులే సాధిస్తోంది.నెలలో సగం రోజులు షూటింగ్ లోనే గడిపినా కృతికకు ఎప్పుడూ 85 శాతం కంటే ఎక్కువగానే మార్కులు రావడం గమనార్హం.

సౌర్య నటన కోసమే కొందరు ప్రేక్షకులు కార్తీకదీపం సీరియల్ చూస్తారంటే సౌర్య టాలెంట్ గురించి సులభంగానే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube