ఈ సీరియల్ హీరోయిన్ ఒక్క 'ఎపిసోడ్'కి ఎంత తీసుకుంటుందో తెలిస్తే?

ప్రస్తుతం చాలా మంది యాక్టర్ లు వెండితెర నుండి బుల్లితెరపై అడుగులు వేస్తున్నారు.వెండితెరపై ఏవో చిన్న చిన్న పాత్రలు వేసే నటులు అంత కూడా బుల్లితెరపై వారికంటూ ప్రత్యేక పాత్రలతో నటిస్తున్నరు.

 Suhasini, Actress,serials,remunaration, Aparanji, Gemini Tv, Dharma, Anubhandhal-TeluguStop.com

అలాంటి నటులలో హీరోయిన్ సుహాసిని ఒకరు.ఈమె కూడా వెండితెర నుండే  వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందే.

సుహాసిని మొదట చిత్రం 2003లో చంటి గాడుతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.అంతే కాకుండా తమిళ, కన్నడ, బోజుపురి వంటి భాషల్లో చిత్రాల్లో నటించగా కొన్ని ప్రత్యేక పాత్రల్లో కూడా నటించింది.

దాదాపు తెలుగులో 19కి పైగా సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించింది.సినిమాలలో హీరోయిన్ గా నటించిన సమయంలో కథ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో సినిమాల్లో హీరోయిన్ గా ఎదగలేకపోయింది.దీంతో ఏమీ చేయలేక సినిమాలు వదులుకొని సీరియల్స్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

2010లో జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ లో బుల్లితెరకు అడుగుపెట్టగా తెలుగులో అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజ కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్ లో ప్రత్యేక పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.తమిళంలోను ఒక సీరియల్ లో దాదాపు మూడేళ్ళ పాటు నటించింది.అయితే తెలుగులో ఇద్దరమ్మాయి సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మ తో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం జెమినీ టివిలో గిరిజ కళ్యాణం సీరియల్ కూడా వస్తుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న దేవత సీరియల్ లో సుహాసిని లీడ్ రోల్ లో నటిస్తుంది.

కొన్ని వారాల క్రితమే ప్రారంభమైన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం వస్తున్న దేవత సీరియల్ లో ఒక్క ఎపిసోడ్ కు రోజుకు రూ.25 వేలు పారితోషికం సుహాసిని తీసుకుంటుంది.అయితే సుహాసిని కేవలం నటనకే అంకితం అవ్వకుండా కొన్ని సీరియల్స్ కి నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube