ఈ హీరోయిన్ల ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

హీరోయిన్లు.సంపాదించిన వారికి సంపాదించినంత.

 Did You Know About Tooywood Heroines Remuneration And Assest, Samantha, Tamanna,-TeluguStop.com

అసలు ఏమి లేకుండా వచ్చిన వారు కూడా ఎంతో సంపాదించారు.దీనికి కావలసినవి మూడే మూడు.

ఒకటి అదృష్టం, రెండు మంచి నటన, మూడు చూడగానే ఆహా ఏమి అందం అనేలా ఉండడమే.ఇక ఈ మూడు ఉన్నవాళ్లు పేరుకు పేరు.

డబ్బుకు డబ్బు.మర్యాదకు మర్యాద అన్ని దక్కుతాయి.
ఇక అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలకు సమానంగా స్టార్ డమ్ సాధించి వారితో సమానంగా పారితోషకం తీసుకొని ఆస్తులు సంపాదించిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.బాలీవుడ్ తో పోలిస్తే కాస్త తక్కువ కానీ టాలీవుడ్ లో కూడా ఆ రేంజ్ లో నటించిన హీరోయిన్లు వీళ్లే.

కాజల్ అగర్వాల్ :

Telugu Tooywood Assest, Kajal, Pooja Hegde, Rashmika, Samantha, Tamanna-Latest N

కాజల్ అగర్వాల్.35 ఏళ్ల వయసు వచ్చిన సరే ఎంతో అందంగా అబ్బాయిల మతి పోగొట్టే హీరోయిన్ ఈమె.స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ భామకు ఇప్పటికి అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు.ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.ప్లాప్ కంటే ఎక్కువ సక్సెస్ లను చూసిన ఈ భామ ఇప్పటికే సినిమాలకు, యాడ్స్ కు కలిపి దాదాపు 100 కోట్లకు పైగానే సంపాదించింది.

సమంత :

Telugu Tooywood Assest, Kajal, Pooja Hegde, Rashmika, Samantha, Tamanna-Latest N

టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె సంపాదన కూడా భారీ స్థాయిలో ఉంది.స్టార్ హీరోల సరసన నటించడమే కాదు నటన ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ సినిమాల్లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.త్వరలోనే వెబ్ సిరీస్ లో కూడా నటించనుంది.ఇక ఒక్క సినిమాకు రెండు కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ అక్కినేని కోడలు నాగ చైతన్యతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించబోతుందట.

తమన్నా :

Telugu Tooywood Assest, Kajal, Pooja Hegde, Rashmika, Samantha, Tamanna-Latest N

తెలుగు ఒక్కటే కాదు ఎందులో అయినా నేను నటిస్తా.పాత్రకు డిమాండ్ ఉండాలి, మంచి పారితోషికం ఉండాలి అనే నటి.హ్యాపీ డేస్ సినిమాలో మధులా క్యూట్ గా కనిపించిన ఈ భామ సంప్రదాయం, ఎక్సపోజింగ్, డ్యాన్స్ ఇలా ఎందులోనూ తక్కువ కాకుండా నటిస్తూ బాగానే సంపాదించింది.యాడ్స్, సినిమాల్లో నటించిన ఈమె 120 కోట్లకుపైగా సంపాదించిందట.

రష్మిక :

Telugu Tooywood Assest, Kajal, Pooja Hegde, Rashmika, Samantha, Tamanna-Latest N

2016లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో మంచి సక్సెస్ రేటు అందుకున్న ఈ నటి ఇప్పటి వరకు 40 కోట్లకుపైగా సంపాదించిందట.

పూజ హెగ్డే :

Telugu Tooywood Assest, Kajal, Pooja Hegde, Rashmika, Samantha, Tamanna-Latest N

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించిన ఆమె తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఆతర్వాత వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందాలోను నటించింది.ఇలా టాలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.

ఒక్కో సినిమాకు 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ భామ 90 కోట్ల రూపాయిల వరకు సంపాదించిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube