అనుష్క శెట్టి రియల్ నేమ్ ఏంటో తెలుసా....?

తెలుగులో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన “సూపర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన మంగళూరు బ్యూటీ “అనుష్క శెట్టి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి అనుష్క శెట్టి టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది.

 Did You Know Real Name Of Telugu Heroine Anushka Shetty , Telugu Heroine, Anushk-TeluguStop.com

అంతేకాకుండా వచ్చి రావడంతోనే “సూపర్” చిత్రం వంటి సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.దీంతో అతి చిన్న మొత్తంతో మొదలైన ఈ అమ్మడు రెమ్యునరేషన్ ప్రస్తుతం కోట్ల రూపాయలు అందుకునే స్థాయికి చేరింది.

అయితే తాజాగా నటి అనుష్క శెట్టి కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వార్త ఏమిటంటే అనుష్క శెట్టి అసలు పేరు గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అయితే ఇంతకీ ఆమె అసలు పేరు ఏమిటంటే స్వీటీ శెట్టి. ఈ అమ్మడుకి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే.కానీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వీటీ శెట్టి తన పేరుని అనుష్క శెట్టి గా మార్చుకుంది.

Telugu Anushka Prabhas, Anushka Shetty, Teluguanushka, Sweaty Shetty, Telugu-Mov

అయితే ఈ పేరు ఈ అమ్మడుకి బాగానే కలిసొచ్చింది.దీంతో స్వీటీ శెట్టి కూడా తన పేరుని అనుష్క శెట్టి గానే ఉంచేసుకుంది.ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రబాస్ వెల్లడించాడు.

అయితే అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి అని ఇప్పటికీ చాలామంది సినీ ప్రేక్షకులకు తెలియదు.అయితే ఇలా సినిమా పరిశ్రమకి వచ్చి పేరు మార్చుకున్న వారు, అలాగే తాము నటించిన చిత్రాలు హిట్ అవ్వడంతో ఆ సినిమా పేర్లనే తమ ఇంటి పేర్లగా మార్చుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తదితరులను ఉదాహరణగా చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన యు.

వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.కాగా ఈ చిత్రంలో అనుష్క శెట్టి తోపాటు జాతిరత్నాలు మూవీ ఫేమ్ “నవీన్ పోలిశెట్టి” కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపిస్తాడట.కాగా ఆమధ్య అనుష్క శెట్టి మెయిన్ లీడ్ పాత్రలో నటించిన “నిశ్శబ్దం” చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని తీవ్రంగా నిరాశపరిచింది.

దీంతో అనుష్క శెట్టి తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులని అలరించాలని కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube