ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ చెల్లెలు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా..?

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్,  తదితర స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తెలుగు హీరోయిన్ “భాను ప్రియ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి భాను ప్రియ తన సినీ జీవితంలో కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా పలు ధారావాహికల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా తన నటనతో కట్టి పడేసింది.

 Did You Know About Telugu Actress Bhanu Priya Sister Shanthi Priya, Telugu Actre-TeluguStop.com

దీంతో పలు సినిమా అవార్డులను కూడా భాను ప్రియ సొంతం చేసుకుంది.కానీ అనుకోకుండా తన వైవాహిక జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా భాను ప్రియ తన జీవితంలో ఎన్నో  ఒడిదుడుకులను ఎదుర్కొంది.

ఇందులో భాగంగా పెళ్లయిన తర్వాత కొన్నేళ్ళ పాటు అమెరికాలో సెటిల్ అయినా కానీ అనుకోకుండా తన భర్తతో విభేదాలు రావడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి సినిమాల్లో నటించడం ప్రారంభించింది.

కాగా నటి భానుప్రియ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె చెల్లెలు కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఒకప్పుడు రాణించిందని.

అయితే ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ శాంతి ప్రియ. ఈ శాంతి ప్రియ తెలుగులో మహర్షి (1988), సింహ స్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, నాకు పెళ్ళాం కావాలి, జస్టిస్ రుద్రమ దేవి, శిలా శాసనం, కలియుగ అభిమన్యుడు, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.

కానీ ఎక్కువగా నటి శాంతి ప్రియ కి తమిళం మరియు హిందీ భాషలలో అవకాశాలు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ పై పెద్దగా దృష్టి సారించచలేక పోయింది.అయితే 1987వ సంవత్సరంలో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన శాంతి ప్రియ 1994వ సంవత్సరం వరకు సినిమాలలో నటించింది.

ఈ క్రమంలో దాదాపు 30కి పైగా చిత్రాలలో మరియు 4కి పైగా ధారావాహికలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇక శాంతిప్రియ వైవాహిక జీవిత విషయానికొస్తే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన సిద్ధార్థ రాయ్ అనే నటుడిని 1995వ సంవత్సరంలో శాంతి ప్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే అనుకోకుండా 2004వ సంవత్సరంలో శాంతి ప్రియ భర్త సిద్ధార్థ రాయ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు.

దీంతో అప్పటి నుంచి తన పిల్లలను పోషించేందుకు శాంతి ప్రియ చాలా కష్టాలు పడుతోంది.తన భర్త మరణానంతరం శాంతి ప్రియ కూడా సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది.

ప్రస్తుతం పలు వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ఫర్వాలేదనిపించిన భానుప్రియ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం బాగానే కష్ట పడుతోంది.

కాగా ప్రస్తుతం తెలుగులో నూతన దర్శకులు “రేవంత్ కోరుకొండ” దర్శకత్వం వహిస్తున్న “నాట్యం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రం క్లాసికల్ డ్యాన్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube