సుడిగాలి సుధీర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బుల్లితెర సూప‌ర్ స్టార్ సుడిగాలి సుధీర్.స‌క్సెస్ కు చిరునామా.అనుకున్న‌ది సాధించాలంటే ల‌క్ష్యం ఉండాలి.ఆ ల‌క్ష్యానికి క‌ఠోర శ్రమ తోడైతే విజ‌యం కూడా నీకు దాసోహ‌మ‌వుతుందంటారు సుడిగాలి సుధీర్.కుటుంబం కోసం 17 ఏళ్ల వ‌య‌స్సులో మెజీషియ‌న్ అవతారం ఎత్తి కమెడియ‌న్ గా, యాంక‌ర్ గా, హీరోగా ఇలా అప్ర‌త‌హితంగా త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సుడిగాలీ సుధీర్ జీవితం వెనుక ఎన్నో క‌ష్టాలున్నాయి.

 Did You Know About Sudheer Life Secrets Sudigali Sudheer, Jabardasth, Rashmi, G-TeluguStop.com

జ‌బర్ద‌స్త్ షో స్టార్ట్ అయ్యిందంటే షో అభిమానులు అన్నీ స్కిట్ల‌క‌న్నా సుడిగాలి సుధీర్ స్కిట్ కోసం ఎదురు చూస్తుంటారు.

స్కిట్ లో పంచ్ లు, త‌న పై వేసే సెటైర్లు, ర‌ష్మీతో గిల్లిగ‌జ్జాలతో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డంలో సుధీర్ ఎప్పుడూ ముందుంటారు.

త‌న కొడుకుపేరు స్క్రీన్ పై క‌నిపించాల‌నేది త‌ల్లి ఆశ‌.అలా త‌ల్లి ఆశ‌ను నెర‌వేర్చేందుకు ఎటువంటి స‌పోర్ట్ లేకుండా టీవీలో వ‌చ్చే డ్యాన్స్ చూసి సొంతంగా తానే డ్యాన్స్ నేర్చుకున్నాడు.ఐదేళ్ల వ‌య‌స్సులో మెజీషియ‌న్ అయిన త‌న మేన‌మామ ద‌గ్గ‌ర మ్యాజిక్స్ నేర్చుకునేవారు.

అలా డ్యాన్స్ తో పాటు, మెజీషియ‌న్ గా త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల‌ని టీవీ షోల‌కు ప్ర‌య‌త్నించారు.ఓసారి డ్యాన్స్ కాంపిటీష‌న్స్ ఫైనల్ మ‌రోవైపు ఇంట‌ర్ ప‌బ్లిక్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది.

ఎటూ తేల్చుకోలేని సిచ్యువేష‌న్ లో ఇంట‌ర్ ఫెయిల్ అయ్యాడు.ఫైనల్ లో ఓడిపోయాడు.

అప్పుడే సుధీర్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.చ‌దువు మానేసి అవ‌కాశాల‌కోసం హైద‌రాబాద్ మొత్తం చుట్టేశాడు.తిండిలేక‌.ఆక‌లితో అల‌మటిస్తూ స‌పోర్ట్ లేక‌, చేతిలో గ‌వ్వ‌లేక ట్యాప్ నీళ్లు తాగి బ్ర‌తికేవాడు.

అన్నా ఒక్క ఛాన్స్ అన్నా అంటూ సినిమా షూటింగ్ లు చుట్టూ తిరిగాడు అక్క‌డా చేదు అనుభ‌వం ఎదురైంది.అవ‌కాశం కావాలంటే డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేసేవారు.

దీంతో హైద‌రాబాద్ లో ఉండలే‌క .త‌న నెగిటీవ్ ప్లేస్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చాడు.ఊళ్ల‌నే పిల్ల‌ల‌కు డ్యాన్స్, మ్యాజిక్ నేర్పిస్తూ ఉండ‌గా…స‌డెన్ గా కుటుంబంలో అనుకోని విషాదం .తండ్రికి యాక్సిడెంట్ కావ‌డంతో ఆయ‌న కాల్లో రాడ్డు వేశారు.దీంతో ఆర్ధిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌య్యాయి. తండ్రి త‌రువాత కుటుంబ పెద్ద‌గా ఉన్న సుధీర్ కుటుంబాన్ని పోషించేందుకు మ‌ళ్లీ హైద‌రాబాద్ కు వ‌చ్చాడు.

అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా రామోజీ ఫిల్మిం సిటీలో మెజీషియ‌న్ గా ఉద్యోగం దొరికింది.అక్క‌డ రెండు సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేసే సుధీర్ కు త‌న త‌ల్లి కోరిక గుర్తుకు వ‌చ్చింది.

దీంతో ఆ ఉద్యోగం మానేసి టీవీ షోలు, సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు.ఆ ప్ర‌య‌త్నంలో సుధీర్ క‌ష్టానికి గెటప్ శీను రూపంలో అదృష్టం తోడైంది.

గెట‌ప్ శీను ద్వారా జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు.కంటెస్టెంట్ గా, టీమ్ లీడ‌ర్ గా, యాకంక‌ర్ గా, సినిమాల్లో హీరోగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నారు సుడిగాలి సుధీర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube