పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ గురించి తెలుసా.. అప్పట్లో పవర్ స్టార్‌కే క్లాస్ పీకిందట!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీ ఎంట్రీతో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Did You Know About Pawan Kalyans First Love Power Star Was Behind The Class At That Time-TeluguStop.com

నిజానికి పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఏ స్టార్ హీరో కి కూడా లేదనే చెప్పవచ్చు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన ఫస్ట్ లవ్ గురించి కొన్ని విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పవన్.ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు ఇలా ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

 Did You Know About Pawan Kalyans First Love Power Star Was Behind The Class At That Time-పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ గురించి తెలుసా.. అప్పట్లో పవర్ స్టార్‌కే క్లాస్ పీకిందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక స్టార్ హీరోగా నిలిచిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి సొంతంగా జనసేన పార్టీని స్థాపించాడు.

ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయ పరంగా బాగా బిజీ అయ్యాడు.

దీంతో మళ్లీ సినిమాలోకి పవన్ ఎంట్రీ ఉంటుందా లేదా అని అభిమానులు తెగ టెన్షన్ పడగా వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇక ఈయన వ్యక్తిగతంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.

Telugu Akkada Ammai Ikkada Abbai, Anna, College Days, First Love, Hari Hara Veera Mallu, Hero, Interesting Facts, Nandini, Pawan Collge Lover, Pawan Kalyan, Pawan Kalyan First Love, Renu Desai, Tollywood-Movie

మూడు పెళ్లిళ్లు చేసుకుని ఈ పెళ్లిళ్ల విషయాలతో కొందరి దృష్టిలో బాగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత పవన్ కు రేణు దేశాయ్ పరిచయం అవ్వడం వల్ల తనతో విడాకులు తీసుకున్నాడు.ఆ తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకొని రష్యా నటి అన్నాలెజ్నేవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.

కానీ పవన్ కళ్యాణ్ తన కాలేజీ సమయంలో కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడట.ఈ విషయం గురించి ఎవరికి తెలియక పోగా గతంలో పవనే నేరుగా చెప్పాడు.

నిజానికి పవన్ ఆ అమ్మాయిని ప్రేమించలేదట.కేవలం తన ఫ్రెండ్స్ తమ మధ్య ప్రేమ ఉందని రెచ్చగొట్టడం వల్ల అమ్మాయి ముందు ఓపెన్ అవ్వాల్సి వచ్చిందట.

తాను మద్రాసులో కంప్యూటర్ క్లాస్ కి వెళ్తున్న సమయంలో ఆ క్లాస్ కి ఓ అందమైన అమ్మాయి కూడా వచ్చేదట.

Telugu Akkada Ammai Ikkada Abbai, Anna, College Days, First Love, Hari Hara Veera Mallu, Hero, Interesting Facts, Nandini, Pawan Collge Lover, Pawan Kalyan, Pawan Kalyan First Love, Renu Desai, Tollywood-Movie

అలా తమ మధ్య మంచి స్నేహంగా సాగుతున్న సమయంలో తన ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కాదంటూ ప్రేమ అని వెళ్లి తనకు చెప్పమని ఎంకరేజ్ చేశారట.దాంతో పవన్ తన పాత కారు తీసుకుని ఆమెను అందులో ఎక్కించుకొని తన ప్రేమ విషయాన్ని తెలిపాడట.ఇక వెంటనే ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ.

అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావ్.ఈ వయసులో ప్రేమ ఏంటి అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో చాలా భయపడ్డాడట.

ఆ సమయంలో ఆ అమ్మాయి తనకు క్లాస్ టీచర్ గా అనిపించిందని తెలిపాడు పవన్.

#Love #Pawan Kalyan #Anna #AkkadaAmmai #Nandini

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు