పద్మవ్యూహం రహస్యం ఏమిటో తెలుసా?  

did you know about The padhmavyuham history padhmavyuham, abhimanyudu, dhronacharya, mahabaratham, hindu believs, hindu bakthi - Telugu Abhimanyudu, Dhronacharya, Did You Know About The Padhmavyuham History, Hindu Bakthi, Hindu Believs, Mahabaratham, Padhmavyuham

పద్మవ్యూహం అంటే శత్రు దేశాలను ఎలా ఎదుర్కోవాలో, వారిపై ఎలా దాడి చేయాలో వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని వేసే పథకాన్ని పద్మవ్యూహం అంటారు.మన పురాణాలలో పాండవులు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నో వ్యూహాలను రచించారు.

TeluguStop.com - Did You Know About Padhmavyuham History

అయితే వాటన్నింటిలో కెల్లా అత్యంత కీలకమైన వ్యూహం పద్మవ్యూహం.

కౌరవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహాన్ని రచించాడు.

TeluguStop.com - పద్మవ్యూహం రహస్యం ఏమిటో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image

ఈ పద్మవ్యూహంలోకి వెళ్లడం, తిరిగి రావడం ఎవరికీ తెలియదు. అపర మేధావులు సైతం ఈ వ్యూహాన్ని ఛేదించ లేకపోయారు.

కేవలం అర్జునుడు, శ్రీ కృష్ణుడి కి మాత్రమే ఈ వ్యూహం యొక్క అర్థం పరమార్థం తెలుసు.ఈ పద్మవ్యూహం వలయాకారంలో ఉండటం వల్ల దీనిని చక్రవ్యూహం అని అంటారు.

ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వ్యక్తులు లోపలికి వెళ్లే కొద్దీ చావుకు దగ్గరగా వెళుతుంటారు.

పద్మవ్యూహాన్ని మృత్యు బిలం అని కూడా పిలుస్తారు.

భీష్ముడు తర్వాత కౌరవుల గురువుగా ద్రోణాచార్యుడు నియమితులైనప్పుడు రెండుసార్లు వీరిరువురి మధ్య యుద్ధం జరిగిన ధర్మరాజును బంధించలేక పోయారంటూ హేళనగా మాట్లాడటంతో అందుకు అవమానంగా భావించిన ద్రోణాచార్యుడు నేను ఈ రోజు వేసే వ్యూహాన్ని దేవతలు కూడా చేదించలేని వేసిన వ్యూహమే పద్మవ్యూహం.

ఈ పద్మవ్యూహం 7 వలయాలలో రథ, గజ,తురగ, పథాది సైన్యాలతో నిర్మితమైనది పద్మవ్యూహం.

కౌరవులను తామర పువ్వు ఆకారంలో నిలిపి, వివిధ దేశాల అధిపతులు తామర పువ్వు లోని రేఖలుగా నిలబడ్డారు, వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడి ఈ వ్యూహాన్ని రచించాడు.ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళిన ఎటువంటి అపర మేధావులైన మృత్యు ఒడికి చేరాల్సిందే.

ఇటువంటి కష్టతరమైన వ్యూహంలోకి అభిమన్యుడు ఎలా ప్రవేశించాడు అంటే….అభిమన్యుడు తల్లి అర్జునుడి భార్య అయిన సుభద్రాదేవి కడుపుతో ఉన్నప్పుడు ఈ పద్మవ్యూహం గురించి తన భర్త అర్జునుడిని అడుగుతుంది.

అప్పుడు అర్జునుడు సుభద్ర దేవి కి పద్మవ్యూహం గురించి వివరిస్తుండగా, ఆమె ఊ కొడుతూ అలాగే నిద్రలోకి వెళుతుంది.

అది గమనించని అర్జునుడు పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటాడు.

కానీ గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊ కొడుతూ ఉంటాడు.అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహం రహస్యం చెప్పడం ఆపేస్తాడు.

అప్పటివరకు గర్భం లో నుంచి అభిమన్యుడు ఎలా పద్మవ్యూహంలోకి వెళ్లాలో అది మాత్రమే వినడం వల్ల పద్మవ్యూహంలోకి వెళ్తాడు.పద్మవ్యూహం లో ఎంతో మంది శత్రువులతో పోరాడి బయటకు ఎలా రావాలో తెలియక శత్రువుల చేతిలో మరణిస్తాడు.

#Dhronacharya #Hindu Believs #DidYou #Padhmavyuham #Abhimanyudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Did You Know About Padhmavyuham History Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL