విజయదశమికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

తెలుగు ప్రజలు విజయ దశమిని ఎంతో పెద్ద పండుగగా  నిర్వహించుకుంటారు.ఆశ్వీయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు.

 How Vijaya Dashami Name Come To Festival, Vijayadashami, Dussehra, Festival Mood-TeluguStop.com

పదవ రోజున ఆశ్వీజ శుద్ధ దశమి శ్రవణా నక్షత్రం నందు విజయదశమి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.దుర్గామాత ప్రత్యేక పూజలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.

మన పురాణాల ప్రకారం పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారి ఆయుధాలను శమీ వృక్షం లో దాచి పెట్టి , వనవాసం అనంతరం ఆ ఆయుధాలను తీసుకొని కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు.ఆరోజు ఆశ్వీజ శుద్ధ దశమి.

అందువల్ల దసరా పండుగ రోజు జమ్మి చెట్టును నమస్కరించి వాటి ఆకులను పెద్దవారికి ఇచ్చి నమస్కరించడం వల్ల మనకు విజయం లభిస్తుందని అనాదిగా ప్రజల విశ్వాసం.

అంతే కాకుండా రాముడు వానర సైన్యంతో కలిసి లంకాధిపతి అయిన రావణాసురుడిని వధించిన రోజు కూడా విజయదశమే.

దేవ దానవుల సంగ్రామంలో క్షీరసాగర మధనం నుంచి విజయ దశమి రోజున అమృతం ఉద్భవించింది.అన్ని విషయాలలో కూడా చెడును అంతం చేసి విజయం కలిగింది కాబట్టి, ఇంతటి ముఖ్యమైన ఆశ్వయుజ శుక్ల దశమినాడు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన కూడా తప్పకుండా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ విజయ దశమి రోజు మనం ఎటువంటి శుభకార్యం చేయడానికి గ్రహస్థితి, గురుబలం, ముహూర్తం చూడవలసిన అవసరం లేదు.మనం చేయాల్సిన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఈ రోజు ప్రారంభించడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఆ పనులు ఎంతో విజయ వంతంగా పూర్తవుతాయి.

అలాగే ఈ దశమి రోజున జమ్మి చెట్టును దర్శించి ఈ స్తోత్రం పఠించాలి. శమీ శమయతే పాపం శమీ శత్రువు వినాశ నీ.అర్జునస్య దనురార్ది రామస్య ప్రియ దర్శిని… అనే స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనం చేసేటటువంటి పనులలో తప్పకుండా విజయం కలుగు తుందని ప్రజల నమ్మకం.

How Vijaya Dashami Name Come To Festival, Vijayadashami, Dussehra, Festival Mood, Hindu Beliefs, Symbol Of Victory, Jammi Chettu, Pandava Vanavasam - Telugu Dussehra, Festival Mood, Hindu Beliefs, Vijayadashami, Jammi Chettu, Symbol Victory

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube