ఆ కామెంట్లు అచ్చెన్నాయుడితో లోకేష్‌కు దూరం పెంచాయా?

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు, శాశ్వ‌త మిత్రులూ ఉండరు.ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు సొంత పార్టీ నేత‌లే వైరం పెంచుకుంటారు.

 Did Those Comments Increase The Distance To Lokesh With Achennaidu-TeluguStop.com

ఇప్పుడు ఇదే క్ర‌మంలో నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు దూరం అయిన‌ట్టు తెలుస్తోంది.వీరిద్ద‌రూ ఇప్పుడు పెద్ద‌గా మాట్లాడుకోవ‌ట్లేద‌ని టీడీపీలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

వీరిద్ద‌రూ పార్టీలో అగ్ర నేత‌లుగానే కొన‌సాగుతున్నారు.కానీ వీరిద్ద‌రే అంటి ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 Did Those Comments Increase The Distance To Lokesh With Achennaidu-ఆ కామెంట్లు అచ్చెన్నాయుడితో లోకేష్‌కు దూరం పెంచాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి ఓ కార‌ణం కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఏంటంటే తిరుప‌తి ఎన్నిక‌లప్పుడు అచ్చెన్నాయుడు చేసిన‌ట్టు కొన్ని కామెట్లు పెద్ద దుమార‌మే రేపాయి.అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అచ్చెన్న గానీ లేదా ఇత‌ర పార‌ట్ఈ నాయ‌కులు గానీ వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.అలాగే చంద్ర‌బాబు నాయుడు లేదా లోకేష్ కూడా వివ‌ర‌ణ అడ‌గ‌లేద‌ని తెలుస్తోంది.

కాకపోతే వీరిద్ద‌రి మ‌ధ్య మాత్రం అప్ప‌టి నుంచే పెద్ద‌గా మాట‌లు లేవ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం వైసీపీని ఢీ కొట్టాలంటే గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల్సిన ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లిసి రాకుండా ఇలా ఎవ‌రి దారి వారిదే అన‌డం తెలుగు త‌మ్ముళ్ల‌కు కునుకు లేకుండా చేస్తోంది.

Telugu Achennayudu, Beeda Ramachandra Yadav, Lokesh And Achenna Conflict, Nara Chandrababu, Nara Lokesh, Tdp, Telugu Desam Party-Telugu Political News

ఇదే విష‌యంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది.నారా లోకేష్‌పై వైసీపీ నేత‌లు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నా అచ్చెన్నాయుడు మాత్రం ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.ఇక‌పోతే అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించడం లోకేష్‌కు పెద్ద‌గా ఇష్టం లేద‌ని తెలుస్తోంది.ఈ కార‌ణంతోనే లోకేష్ టీమ్ బీద రవచంద్రయాదవును పార్టీలో హైలెట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక అచ్చెన్నాయుడు కూడా డైరెక్టుగా చంద్రబాబుతోనే లోకేష్ వ్య‌వ‌హారంపై ఫిర్యాదు కూడా చేసిన‌ట్టు స‌మాచారం.త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌ల్లో లోకేష్ జోక్యం చేసుకోవ‌ద్ద‌ని చెప్పిన‌ట్టు టీడీపీలో ర‌చ్చ జ‌రుగుతోంది.

ఇక ఇదే విష‌యం లోకేష్‌కు తెలిసి తెల‌సి కాస్త సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

#Nara Lokesh #Achennayudu #LokeshAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు