ఈటెల విషయంలో కేసీఆర్ వ్యూహం విఫలమయిందా?

ఈటెల, కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుండో కొనసాగుతున్నప్పటికీ ఎప్పటి నుండో చర్యలు తీసుకోవాలని అనుకున్నా, సరైన సమయం కొరకు వేచి చూసిన కేసీఆర్ రైతుల ఫిర్యాదును ఆసరాగా చేసుకొని ఈటెలపై చర్యలు తీసుకున్నారు.అసలు ఈటెలపై కేసీఆర్ వేసిన వ్యూహం ఏంటని ఒకసారి పరిశీలిస్తే  రకరకాలుగా ప్రభుత్వం పై పరోక్ష విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఈటెలను ఏ కారణం లేకుండా భర్తరఫ్ చేస్తే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన కేసీఆర్ అవినీతి మరక వేసి భర్తరఫ్ చేద్దామని ప్రయత్నించాడు.

 Did This Strategy Of Kcr In The Case Of Spears Fail?/kcr, Etela Rajender-TeluguStop.com

అచ్చం అలాగే చేశారు కూడా.కాని ఈటెల ఏ మాత్రం బెదరకపోగా పెద్ద ఎత్తున ఈటెలకు సానుభూతి వ్యక్తమయింది.

అంతేకాక హైకోర్టు కూడా ఈటెల భూ కబ్జా ఆరోపణలపై ఇచ్చిన మెదక్ కలెక్టర్ హరీష్ నివేదికను ఇది తప్పుడుతడకల నివేదిక అని వ్యాఖ్యనించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడడంతో ఈటెల విషయంలో ఉన్న సీరియస్ అనేది తగ్గిపోయింది.ఇక ఈ వ్యూహం విఫలం కావడంతో మరల నియోజకవర్గం పై కేసీఆర్ దృష్టి సారించిన విషయం తెలిసిందే.

మరి హుజూరాబాద్ వ్యూహమైనా ఫలిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఎందుకంటే కార్యకర్తలను ఈటెల వైపు వెళ్లకుండా నిలువరించగలిగితే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ సగం విజయం సాధించిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube