టీ20 ప్రపంచకప్​లో ఈ ఆటగాళ్లు ఆడతారా..?

ఇటీవల  చాలా మంది క్రికెటర్లు గాయాలపాలై అనేక ఇబ్బందులు పడుతుంటారు.ఒకసారి గాయం అయితే కోలుకోవడానికి కొన్నిరోజులు, ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని రోజులు, ఫామ్ లోకి రావడానికి కొన్నిరోజులు పడుతుంది.

 Did These Players Who Are Injured Will Play In T 20 World Cup Matches-TeluguStop.com

దీని వల్ల వారు కొన్ని మ్యాచ్ లను ఆడలేకపోతుంటారు.దీనివల్ల అభిమానులల్లో కూడా నిరాశ అనేది చోటుచేసుకుంటుంది.

ఇప్పుడు జరిగిన ఐపిఎల్ లో కూడా కొందరు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.దీనివల్ల వారు మళ్లీ మ్యాచులు ఆడతారో లేదో అన్న సందేహం అందరిలోనూ నెలకొని ఉంది.

 Did These Players Who Are Injured Will Play In T 20 World Cup Matches-టీ20 ప్రపంచకప్​లో ఈ ఆటగాళ్లు ఆడతారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి వన్డేలో గాయపడ్డాడు.

భుజంలోని ఎముక స్థానభ్రంశం చెందడం వల్ల ఇతడు ఈ సిరీస్​కు దూరమవుతాడని మొదట ప్రకటించింది బీసీసీఐ.కానీ గాయం పెద్దది కావడం వల్ల చికిత్స అవసరమని భావించిన బోర్డు ఐపీఎల్ 2021 లోనూ శ్రేయస్ పాల్గొనట్లేదని వెల్లడించింది.రాజస్థాన్ రాయల్స్​కు బెన్ స్టోక్స్​ ప్రధాన ఆల్​రౌండర్.కానీ సీజన్​లో పంజాబ్ కింగ్స్​తో జరిగిన మొదటి మ్యాచ్​లోనే జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.

ఈ మ్యాచ్​లో క్రిస్​ గేల్ ఇచ్చిన క్యాచ్​ను అందుకునే సమయంలో స్టోక్స్​ ఎడమచేతి వేలు విరిగింది.దీంతో ఇతడు లీగ్​ మొత్తానికి దూరమయ్యాడని ప్రకటించింది ఫ్రాంచైజీ.

తర్వాత ఇంగ్లాండ్ పయనమైన స్టోక్స్​ చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు.టీమ్ఇండియా పేసర్ నటరాజన్​ ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2021లో అడుగుపెట్టాడు.

మొదటి రెండు మ్యాచ్​లు ఆడిన ఇతడు ఆ తర్వాత గాయం కారణంగా పూర్తి లీగ్​కు దూరమవుతున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.ఇటీవలే విజయవంతంగా మోకాలి చికిత్స పూర్తి చేసుకున్న నటరాజన్ సెప్టెంబర్​లో తిరిగి ప్రారంభమయ్యే లీగ్​లో సత్తాచాటాలని భావిస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్​కు జోఫ్రా ఆర్చర్ గాయం మరో దెబ్బే.టీమ్ఇండియాతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన ఆర్చర్​ లీగ్​కు పూర్తిగా దూరమయ్యాడు.

ఇతడు ఇటీవలే కోలుకుని కౌంటీ క్రికెట్​లో అడుగుపెట్టాడు.

#Shreyas Iyer #Jofra Archer #Sports Updates #Ipl2021 #T20World

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు