ఆదిలోనే బీజేపీలో కుమ్ములాటలు మొదలయ్యాయా?

ఇప్పుడిప్పుడే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలపడాలని చూస్తున్న బీజేపీలో ఇప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానాలిస్తున్నాయి.పాత నేతలతో పాటు కొత్త నేతల చేరికపై దృష్టి పెట్టిన బీజేపీ, పాత నేతల, కొత్త నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ను అంతగా పట్టించుకోవడం లేదు.

 Did The Scuffles Start In Bjp In The Beginning-TeluguStop.com

ఈ ప్రచారానికి బలం చేకూర్చే రెండు ఉదాహరణలు మనం చూసాం.పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ రెడ్డి బీజేపీలో చేరాడు.

పెద్దపల్లిలో అత్యధిక బలం కలిగి ఉన్న మాజీ ఎంపీ వివేక్ వీరి రాకను వ్యతిరేకించారు.దీంతో అలక పూని ఆగం చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ చేరిక సమావేశానికి హాజరు కాలేదు.

 Did The Scuffles Start In Bjp In The Beginning-ఆదిలోనే బీజేపీలో కుమ్ములాటలు మొదలయ్యాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరొక్క ఘటన చూస్తే రామగుండంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సోమారపు సత్యనారాయణ ఇటీవల పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ లో ఉన్న సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ తో విభేదాలతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

కాని ఇప్పుడు సోమారపు సత్యనారాయణకు స్థానిక బీజేపీ నేతలు సహకరించడం లేదని బీజేపీకి రాజీనామా చేశారు.ఇలా ఇంకా యుద్దాన్ని మొదలు చేయకుండానే కుమ్ములాటలు మొదలైతే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా ఉంది.

#@BJP4Telangana #Vivek #Bandi Sanjay #Mp Vivek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు