ఆ రెండు విష‌యాల్లో టీడీపీ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా..?

రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉందని అనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణలో అయితే ఇక కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

 Did Tdp Missed The Golden Chance To Question Ycp In That Two Cases, Ap Tdp, Chan-TeluguStop.com

టీటీడీపీ చీఫ్ కూడా పార్టీ మారగా, కేడర్ వేరే పార్టీల్లోకి షిఫ్ట్ అయింది.ఇక విభజిత ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అక్కడ రాజకీయంగా యాక్టివ్‌నెస్, క్రియాశీలత ఎలా ఉందనేది చర్చించాల్సిన అంశాలు.

కేవలం జగన్ పై ఉన్న వ్యతిరేకత మాత్రమే వారికి విజయం తెచ్చిపెడ్తుందనుకుంటే అది భ్రమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యలపై పోరాడి ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ వద్ద స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా బీజేపీ చర్యలపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు.కేంద్ర వైఖరిని నిలదీసే పరిస్థితులు కనిపించడం లేదు.ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణకరణకు వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నాయి.కానీ, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయట్లేదు.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Cm Jagan, Golden Chance, Krishna, Mp Ram Mohan,

సమావేశంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి ప్రాధాన్యత పెరగగా, కేంద్రాన్ని నిలదీయడానికి వైసీపీ లీడ్ తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరడం చర్చనీయాంశమైంది.అలా వైసీపీ ముందుకొస్తే రాజీనామాలకు తాము సిద్ధమని రామ్మోహన్ నాయుడు ప్రకటించడం ద్వారా టీడీపీ నిజ స్వరూపం బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

విశాఖ ఉక్కు సమస్య మీద అంత చిత్తశుద్ది ఉంటే టీడీపీనే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి.

అప్పుడు వైసీపీ కలిసి రాకపోతే అధికార పార్టీపై ఒత్తిడి పెంచొచ్చు.అలా చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందవచ్చు.

Telugu Ap, Ap Tdp, Chandrababu, Cm Jagan, Golden Chance, Krishna, Mp Ram Mohan,

కానీ అలా కాకుండా సమస్యకు కారణమైన కేంద్రాన్ని వదిలేసి జగన్కు ఇరకాటంలో పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.ఈ ప్రయత్నం కచ్చితంగా బెడిసికొట్టే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలపైన తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని జగన్‌ను విమర్శించే మందర చంద్రబాబు తన వైఖరి చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.మొత్తంగా ఈ రెండు విషయాల్లో టీడీపీ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుందేమోనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube