టీడీపీ ఏజెంట్స్ అంతపని చేశారా ? బాబు ఆగ్రహానికి కారణం అదేనా ?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో పోలింగ్ సరళి మీద కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో ఎంతవరకు ఆయా వర్గాల ఓటు బ్యాంక్ ను ప్రభావితం చేసింది అనే విషయం మీద మేధో మథనం స్టార్ట్ చేసింది.

 Did Tdp Agents Do Which Makes Babu Angry-TeluguStop.com

నియోజకవర్గాల వారీగా టీడీపీకి పడ్డ ఓట్ల శాతాన్నిఅంచనా వేస్తోంది.ఈ సందర్భంగా పార్టీ నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు కి దిమ్మతిరిగే సమాధానాలు వస్తుండడంతో విస్తుపోవడం బాబు వంతయ్యింది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా, కార్యకర్తల పట్టుదల ఎంతోకొంత ఆ పార్టీకి కలిసి వచ్చేది.అయితే అనూహ్యంగా టీడీపీ ఏజెంట్లే పార్టీని చేజేతులా ముంచేసినట్టు అర్ధం అవుతోంది.

ఇది బాబు లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది.

ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు చాలా జిల్లాల్లో ఇదే తంతు జరిగినట్టు బాబు దృష్టికి వచ్చింది.

టీడీపీ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడమే కాకుండా, కొందరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ కూడా ఓటర్లకు సూచించినట్టు తెలుస్తోంది.మరికొందరు సైలెంట్ గా ఉండిపోయి వైసీపీ ఏజెంట్లు ఏమి చెప్పినా నోరు మెదపకుండా ఉండిపోయారట.

తమ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని వారంతా ఒక నిర్దారణకు వచ్చాక వారు ఈ విధంగా వ్యవహరించారట.దీనంతటికి స్థానిక రాజకీయ పార్టీల పరిస్థితులే కారణం అని తెలుస్తోంది.

తమ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే తమకు వేధింపులు ఎక్కువ అవ్వకుండా ఈ విధంగా చేసినట్టు తెలుస్తోంది.

-Telugu Political News

ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కో వార్త బాబు చెవిన పడుతుండడంతో చంద్రబాబుకు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయని, దీంతో ఆయన పార్టీ శ్రేణుల మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాత్రనక, పగలనక కష్టపడి తాను పనిచేస్తే ఆ కష్టాన్నంతటిని వృధా చేసే ప్రయత్నం సొంత పార్టీ నేతలే చేస్తారని తాను కలలో కూడా ఊహించలేదు అంటూ బాబు తన సన్నిహితుల దగ్గర వాపోయాడట.ఎలాగూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని అప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోను అంటూ బాబు వ్యాఖ్యానించాడట.

అలాగే టీడీపీకి మహిళా ఓటర్లు పెద్ద ఓటు బ్యాంక్ గా మారుతారనుకుంటే వారి ఓట్లు కూడా సక్రమంగా పడలేదని, దీనికి బ్యాంకర్ల వైకిరి కూడా కారణం అని బాబు వ్యాఖ్యానించాడట.పసుపు కుంకుమ చెక్కులు సకాలంలో క్లియర్ చేయకపోవడం కూడా టీడీపీ కి పడాల్సిన ఓట్లను డైవర్ట్ చేసినట్టు బాబు కి రిపోర్ట్స్ అందడంతో ఓ ఉన్నతాధికారిని సమీక్షకు పిలిస్తే, ఆయన ఎన్నికల నిబంధనల సాకు చూపించి తప్పించుకున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube