ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరి రోజుల్లో స్టార్ హీరోస్‌కు ఇలాంటి సలహాలు ఇచ్చారా?

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పేరు వినగానే ఓ మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ మరింత బాధ పెడుతుంది.గత ఏడాది కరోనా సమయంలో అనారోగ్య సమస్య కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

 Did Sp Balasubramaniam Give Such Advice To Star Heroes In His Last Days-TeluguStop.com

గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించగా.దాదాపు ఏడాది కావడానికి వస్తుంది.

ఈయన మరణ వార్త విని ఎంతోమంది అభిమానులు, సినీ రంగాలు, ఇతర రంగాలు కంటతడి పెట్టారు.ఇప్పటికీ ఆయన మాటలు, ఆయన పాటలు ఇంకా గుర్తుకొస్తూనే ఉంటాయి.

 Did Sp Balasubramaniam Give Such Advice To Star Heroes In His Last Days-ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరి రోజుల్లో స్టార్ హీరోస్‌కు ఇలాంటి సలహాలు ఇచ్చారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన మొదట్లో కొన్ని సినిమాలలో అతిథి పాత్రలో నటించారు.ఆ తర్వాత సహాయ పాత్రల్లో కూడా నటించాడు.మొదట శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యాడు.ఇందులో పాడిన పాటకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు బాలు గారు.ఇక ఈయన బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు.

ఇప్పటికీ ఈయన పాటలు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఈయన ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశాడు.ఇక ఈయన నటించిన ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాలలో తన పాత్రలను అద్భుతంగా పోషించాడు.

ఈయన ఎంతోమంది గాయకులను పరిచయం చేశాడు.

Telugu Advices, Dubbing Artist, Forty Thousand Songs, Hero, National Awards For Telugu Movies, Singer, Sp Balasubramaniam, Sp Balu Died Of Corona, Sp Balu Last Days, Tollywood-Movie

ఇక ఈయనకు గత ఏడాది ఆగస్టులో కరోనా వైరస్ సోకింది.ఆ తర్వాత ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిన సమయం లో శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యాయి.వాటికి చికిత్స అందిస్తుండగానే సెప్టెంబర్ 25న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఇక ఈయన మరణించినా కూడా ఈయన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూనే ఉంటారు ఈయన అభిమానులు, సినీ ప్రముఖులు.ఆయన చివరి రోజుల్లో స్టార్ హీరోలకు కొన్ని సలహాలు ఇచ్చాడట.

తెలుగు సినిమాకు జాతీయ అవార్డులు రావడం లేదని అనుకోవడం కాదని.ఆ స్థాయి సినిమాలను చెయ్యమని తెలిపాడు.

Telugu Advices, Dubbing Artist, Forty Thousand Songs, Hero, National Awards For Telugu Movies, Singer, Sp Balasubramaniam, Sp Balu Died Of Corona, Sp Balu Last Days, Tollywood-Movie

తెలుగుజాతి గురించి చాటిచెప్పేలా ఒక సినిమా అయినా చెయ్యాలి అని వారికి తెలిపాడు.అంతే కానీ ఎక్కువగా కమర్షియల్ సినిమాల పై ఆసక్తి చూపకండి అంటూ కోరాడు.బాలీవుడ్ లో మంచి హిట్ ను అందుకున్న దంగల్ లాంటి సినిమాలను చేసే నటులు తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్నారా అంటూ ప్రశ్నించాడు.

ఒక నాలుగు సినిమాలను ఎంచుకున్నప్పుడు అందులో ఒక్క సినిమాను తెలుగు జాతి కోసం, తెలుగు జాతిని మరింత పెంచడం కోసం తీయండి అని సలహా ఇచ్చాడు.

మిథునం లాంటి మంచి సినిమా చేస్తే కనీసం 10 థియేటర్లు కూడా దొరకలేని పరిస్థితి వచ్చిందని వాపోయాడు.ముఖ్యంగా ప్రేక్షకులను సినిమా విషయంలో నటించే నటీనటులను ప్రశ్నించాలి అని తెలిపాడు.

#Artist #Balu Corona #National Awards #Balu #Thousand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు