తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో పోతోంది.
విడాకుల తర్వాత సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ఇక విడాకుల వ్యవహారం తరువాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చుకుంది.
ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగు కు చిందులు వేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.ఈ పాటతో సమంత క్రేజ్ మరింత పెరిగింది.సమంత క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతూ వస్తోంది.ఈ క్రమంలోనే సమంత చేతికి సరికొత్త బ్రాండ్స్ వచ్చి చేరుతున్నాయి.
అయితే సమంత క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి బ్రాండ్స్ ఆమె వెంట పడుతున్నాయా, లేక సమంతనే బ్రాండ్ వెంటపడుతున్న అనేది తెలియదు కానీ వారానికి ఒక కొత్త బ్రాండ్ ఈ ప్రకటనతో సందడి చేస్తోంది.తాజాగా సమంత స్పోర్టింగ్ యాప్ డ్రీమ్ 11 మరియు ఫార్చ్యూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత నియమించబడింది.

అయితే ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే కొద్ది వారాల క్రితం సమంత బ్లెండర్స్ ప్రైడ్ సౌత్ అలాగే ఫాంటా ప్రకటనలో కనిపించిన విషయం తెలిసిందే.అలాగే మామఎర్త్ ఫేస్ వాష్ బ్రాండ్ యాడ్ లో నటించింది.అయితే వీటితో పాటుగా మరికొన్ని కంపెనీలు ప్రచారకర్తగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది.సమంతా కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అలాగే అప్పుడప్పుడు వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
వీటితో పాటుగా సమంత చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది.