ఆ విష‌యంలో రేవంత్‌కు పెద్ద అస్త్రం దొరికేసిందా.. టీఆర్ ఎస్‌కు కొత్త చిక్కులు

తెలంగాణ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంటే సీఎం కేసీఆర్‌కు మాన‌స పుత్రిక‌.బీడు భూముల‌ను పంట పొలాలుగా మార్చేందుకు చేప‌ట్టిన అతిపెద్ద నీటి ప్రాజెక్టు.

 Did Rewanth Get A Big Ax In That Matter New Implications For Trs, Trs, Rewanth , Kaleshwaram Project , Kcr , Ts Poltics , Ts Congress, Formmers , Trs Mlas-TeluguStop.com

సీఎం కేసీఆర్ ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా స‌రే లేదంటే ఏ స‌భ‌కు వ‌చ్చినా స‌రే కాళేశ్వ‌రం గురించి చెప్ప‌కుండా త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌రు.ఇక టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల‌ది కూడా ఇదే బాట‌.

ప్ర‌తి దానికి కాళేశ్వ‌రాన్ని భుజాన వేసుకుని ప్ర‌చారం చేయ‌డం ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం.కేసీఆర్ హ‌యాంలో రైతుల‌కు జ‌రిగిన అతి పెద్ద మేలు ఇది అని వారు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు.

 Did Rewanth Get A Big Ax In That Matter New Implications For TRS, TRS, Rewanth , Kaleshwaram Project , Kcr , Ts Poltics , Ts Congress, Formmers , Trs Mlas-ఆ విష‌యంలో రేవంత్‌కు పెద్ద అస్త్రం దొరికేసిందా.. టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ క‌ల‌ల ప్రాజెక్టు మీద నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.ప్ర‌తిప‌క్షాలు ఎప్ప‌టి నుంచో ఇందులో అవినీతి జ‌రిగిందంటూ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.

ఇక‌పోతే ఇన్ని రోజులకు ప్ర‌తిప‌క్షాల‌కు ఓ పెద్ద అస్త్రం దొరికేసిన‌ట్టు అయింది.రీసెంట్ గా ది “ది న్యూస్ మినిట్ లో ఇరిగేష‌న్ చీఫ్ సెక్ర‌ట‌రీ కుమార్తె మ్యారేజ్ ఖర్చులు కాళేశ్వరం క‌ట్టిన మేఘా కంపెనీ పెట్టుకుంద‌ని, అందుకు పెద్ద పెద్ద వారికి పార్టీలు కూడా ఇచ్చింద‌ని ఆధారాల‌తో స‌హా పెద్ద స్టోరీ రెడీ చేసేసింది.

అయితే దీన్ని రేవంత్ త‌న అస్త్రంగా మార్చేసుకున్నారు.

ఆ క‌థ‌నాన్ని, ఆధారాల‌ను చూపించి వెంట‌నే విచార‌ణ జ‌ర‌పాలంటూ డిమాండ్ చేశారు.ఐఏఎస్ ఆఫీస‌ర్ కుమార్తె పెండ్లికి దాదాపు రూ.50 లక్షల దాకా ఎందుకు ఖ‌ర్చు పెట్టారంటూ ప్ర‌శ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి.ఇక ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కూడా వేల కోట్ల ముడుపులు అందాయ‌ని, వెంట‌నే వాట‌న్నింటిపై కూలంకుషంగా విచార‌ణ జ‌ర‌పాలంటూ డిమాండ్ చేస్తున్నారు రేవంత్‌రెడ్డి.అయితే ఇప్పుడు ఈ వ్య‌వ‌హార‌మే పెద్ద దుమారం రేపుతోంది.

మొత్తానికి టీఆర్ ఎస్ కు ఈ వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగానే మారిపోయింద‌ని చెప్పాలి.

Did Rewanth Get A Big Ax In That Matter New Implications For TRS, TRS, Rewanth , Kaleshwaram Project , Kcr , Ts Poltics , Ts Congress, Formmers , Trs Mlas - Telugu Formmers, Rewanth, Trs Mlas, Ts Congress, Ts Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube