రజని కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడో తెలుసా..?  

Did Rajini Know His New Party Statement-

ప్రముఖ నటుడు రజనీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన పది మాసాల తర్వాత రజనీ మక్కల్ మండ్రమ్ సభ్యులను పార్టీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మండ్రమ్ జిల్లా శాఖ సమావేశాలు ఈ నెల 5నుండి 11వరకు వారం రోజుల పాటు సాగిన తర్వాత కేవలం నోటి మాట ద్వారా ఈ సందేశం అందరికీ చేరింది. అయితే ఇంతవరకు రజనీకాంత్ నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. పార్టీ ప్రకటించే సందర్భంగా జరిగే కార్యక్రమానికి దాదాపు 10లక్షల మంది ప్రజలను సమీకరించాలని భావిస్తున్నారు. బహుశా తిరుచిలో సభ జరిగే అవకాశాలు వున్నాయి...

రజని కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడో తెలుసా..? -Did Rajini Know His New Party Statement