క్షేత్రస్థాయి నాయకుల వ్యవహార శైలితోనే కేసీఆర్ పై ప్రజలకు వ్యతిరేకత మొదలైందా?

తెలంగాణలో బీజేపీ క్రమేపీ బలపడుతున్న పరిస్థితులలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలవడం, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం అనేది మనం చూశాం.కాని ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

 Did Public Opposition To Kcr Start With The Business Style Of Field Level Leader-TeluguStop.com

కొద్ది సేపు బీజేపీ వ్యతిరేక ప్రచారం వలనే టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు నమోదయ్యాయని అనుకుంటే, గత సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా టీఆర్ఎస్ పై బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశాయి.కాని అప్పుడు ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టాయి.

కాని అదే తరహాలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై చేసిన వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మి టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు.అసలు ఈ పరిస్థితి టీఆర్ఎస్ కు ఎందుకు వచ్చిందని ఒకసారి మనం విశ్లేషించుకుంటే రెండు సార్లు అధికారంలోకి రావడంతో క్షేత్ర స్థాయి నాయకులు ఆరాచకాలకు పాల్పడుతుండడం, భూ కబ్జాలు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం, నాయకుల నోటి దురుసుతనం, కేసీఆర్ ఇచ్చిన హామీలలో కొన్ని నెరవేర్చకపోవడం లాంటి వాటిని ప్రజలలో ఉన్నా వాటిని వెలికితీసి వారికి ఉన్న ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రజలు చూపించారు.

క్షేత్ర స్థాయి నాయకుల వైఖరిని కేసీఆర్ గమనించకపోవడం, అలాగే ప్రజలకు కలిసేందుకు సమయం ఇవ్వకపోవడం ఇలాంటి సంఘటనలపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమని భావించి ప్రతిపక్షాలకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తున్నారు.మరి కేసీఆర్ మదిలో ఏముందో, భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube