సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ల సినిమాని సూపర్ హిట్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.అందులో భాగంగానే చాలా కాంబినేషన్లను కూడా సెట్ చేస్తూ ఉంటారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ చాలా పెద్ద స్టార్ హీరో అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈయన చేయాల్సిన రెండు సినిమాలని వేరే హీరో చేయాల్సి వచ్చింది ఆ హీరోకి ఆ సినిమాలు చేయమని చెప్పింది కూడా ప్రభాస్( Prabhas ) అనే విషయం చాలామందికి తెలియదు.

అయితే ఆ సినిమాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా ప్రభాస్ చేయాల్సిన యజ్ఞం సినిమా( Yagnam ) గోపీచంద్ హీరోగా చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు.అయితే ఈ సినిమా మొదటగా ప్రభాస్ దగ్గరికి వెళ్లినప్పటికీ ఆయన అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు చేయలేక పోయాడు ఇక అలాగే ఈ సినిమా గోపి చంద్ కి అయితే చాలా బాగుంటుంది అని అ ప్రొడ్యూసర్లతో చెప్పాడంట దాంతో వాళ్లు గోపీచంద్ ని హీరోగా పెట్టి యజ్ఞం సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ప్రభాస్ హీరోగా చేయాల్సిన మరో సినిమా ఏంటి అంటే రాధాకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన జిల్ సినిమా( Jil )…

ఈ సినిమా కథని ఆ డైరెక్టర్ మొదటగా ప్రభాస్ కి వినిపించినప్పటికీ అప్పుడు ఆయన బాహుబలి( Baahubali ) సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు.దాంతో యూవి క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అయినా గోపీచంద్ ని సినిమాకి ప్రభాస్ పెట్టించడం జరిగింది.ఈ సినిమా స్టైలిష్ గా ఉంటుంది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.అదే ప్రభాస్ ఈ సినిమా చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు కూడా దగ్గరుండి ప్రభాస్ గోపీచంద్ తో చేయించినట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే గోపీచంద్ ప్రభాస్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టే అందుకే ప్రభాస్ అలా చేసినట్టు గా తెలుస్తుంది…
.