తారక్ బాక్సాఫీస్‌కు నిజంగా బొమ్మను చూపించాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Did Ntr Showcase His Full Acting Potential, Ntr, Rrr, Prashanth Neel, Acting, To-TeluguStop.com

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని తారక్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ తన విశ్వరూపాన్ని చూపించనున్నట్లు గతకొద్ది రోజులుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అంటే తారక్ ఇప్పటివరకు చేయని యాక్టింగ్‌ను మనం ఈ సినిమాలో చూడనున్నామా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే ఎక్కువ వినిపిస్తోంది.తారక్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు.

కాగా పలు సినిమాల్లో తన యాక్టింగ్‌తో ఔరా అనిపించాడు.అయితే తనలోని విధ్వంసాన్ని మాత్రం కొమురం భీం పాత్రలో చూపించబోతున్నాడట.

ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌లో ఎన్టీఆర్ చూపించే హావభావాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఇక యాక్షన్ సీన్స్‌లో తారక్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

గతంలో తారక్‌ను చూడని విధంగా ఈ సినిమాలో ఆయనలోని నటుడిని మనం చూస్తామని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో మరో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ యూనిట్ అంటోంది.

ఇద్దరు మేటి నటుల నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను రాబట్టడంలో దర్శకుడు రాజమౌళి తనదైన మార్క్ వేసుకుంటున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.పూర్తి పీరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో తారక్ ఈ సినిమాతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరి ఈ సినిమాతో తారక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube