‘‘హౌడీ మోడీ’’కి మేం పైసా ఖర్చు పెట్టలేదు: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటన  

Did not incur expenses for \'Howdy-Modi\' event in Houston last year, says Indian government, India, Narendra Modi, How D Modi, Donald Trump, Texas India Forum Incorporation, jugal Malani, - Telugu Donald Trump, How D Modi, India, Jugal Malani, Narendra Modi, Texas India Forum Incorporation

భారత ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో పాల్గొన్న హౌడీ మోడీ కార్యక్రమానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.మోడీ పట్ల, భారత్ పట్ల అమెరికన్లకు, భారత సంతతి ప్రజలకు ఉన్న అభిమానం ఆ భారీ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది.

TeluguStop.com - Did Not Incur Expenses For Howdy Modi Event In Houston Last Year Says Indian Government

అయితే ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్.

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఓ ప్రశ్నకు సమధానంగా రాజ్యసభలో ఆయన ఈ ప్రకటన చేశారు.

TeluguStop.com - ‘‘హౌడీ మోడీ’’కి మేం పైసా ఖర్చు పెట్టలేదు: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటన-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

హౌడీ మోడీ కార్యక్రమం కోసం ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టడం లేదా నిర్వాహకులు విరాళాలు సేకరించడం వంటివి జరిగాయా అన్న ప్రశ్నకు మంత్రి అటువంటివేవీ లేవని సమాధానం ఇచ్చారు.

హౌడీ మోడీ! ఈషేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్‌” పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరమ్ ఇన్‌కార్పొరేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని మురళీధరన్ వెల్లడించారు.టెక్సాస్‌లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన జుగల్ మలాని అనే వ్యక్తి ఈ సంస్థకు చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు.

2019 సెప్టెంబర్ 22న జరిగిన ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా హాజరై మోడీకి అపూర్వ స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

#India #Jugal Malani #Narendra Modi #TexasIndia #How D Modi

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did Not Incur Expenses For Howdy Modi Event In Houston Last Year Says Indian Government Related Telugu News,Photos/Pics,Images..