టాలీవుడ్ కు నయన్ బై బై చెప్పినట్లేనా..?!  

nayatara, telugu cini industry, tamil industry, movies - Telugu Movies, Nayatara, Tamil Industry, Telugu Cini Industry

టాలీవుడ్ ఇండస్ట్రీకి నయనతార గుడ్ బాయ్ చెబుతుందా అన్న వార్తలు టాలీవుడ్ లో గుసగుసలుగా వినబడుతున్నాయి.అవును.

TeluguStop.com - Did Nayanatar Say Bye Bye To Tollywood

మీరు విన్నది నిజమే.నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పినట్లే అనిపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా తమిళ సినీ అభిమానులు నయనతారను ఓ దేవతగా కొలుస్తూ ఆమెను ఆరాధిస్తారు.అయితే తమిళంలో ఉన్న క్రేజ్ తో పోలిస్తే తెలుగులో కూడా నయనతారకు చాలా ఫాలోయింగ్ ఉండనే ఉంది.

TeluguStop.com - టాలీవుడ్ కు నయన్ బై బై చెప్పినట్లేనా..-General-Telugu-Telugu Tollywood Photo Image

టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంతో మంది ఆమె అభిమానులు లేకపోలేరు.అయితే నయనతారకి ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల అలాగే ఆమె పెట్టె కండిషన్లు ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చెయ్యట్లేదు అని అర్థమవుతుంది.

అందులో ముఖ్యంగా నయనతార టాలీవుడ్ లో కేవలం బడా హీరోల సినిమాలు మాత్రమే ఓకే చేస్తుండగా, కుర్రకారు హీరోల సినిమాలకు నో చెప్పేస్తుందట.అది కూడా బడా హీరోల సినిమాలో భారీ పారితోషకం లభిస్తేనే ఓకే చెబుతుంది.

లేకపోతే ఆ ప్రాజెక్టును సుతిమెత్తంగా రిజెక్ట్ చేస్తుందట.దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె టాలీవుడ్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పే సమయం వచ్చినట్లు అనుకుంటున్నారు.

అయితే అంత మంది స్టార్ హీరోల సరసన నటించిన కానీ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కూడా నయనతార కనిపించదు.దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం నయనతార తన కాబోయే భర్త విగ్నేష్ తో కలిసి నటిస్తున్న భారీ చిత్రం తో పాటు.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్ పాత్ర చేస్తోంది.

అంతేకాదు కొంతమంది తమిళ అగ్ర హీరోల సరసన నటించడానికి కూడా ఆమె డేట్ల కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.దీనికి కారణం లేకపోలేదు.తమిళనాడు రాష్ట్రంలోని సినీ ప్రేమికులు నయనతారను దేవతగా కొలుస్తూ ఆరాధిస్తుంటారు.తలైవి రేంజ్ కి ఎదిగిన నయనతార అక్కడి అభిమానులకు ఎంతగానో ఇష్టం.

అందుకేనేమో ఇక తమిళ పరిశ్రమను నయనతార వదిలిపెట్టలేదు అన్నట్లుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

#Nayatara #TeluguCini #Movies #Tamil Industry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did Nayanatar Say Bye Bye To Tollywood Related Telugu News,Photos/Pics,Images..