మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ లో మమతా మోహన్ దాస్ ఒకరు.ఈమె గాయనిగా తెలుగులోకి అడుగు పెట్టింది.
ఈ బ్యూటీ తన సింగింగ్ ట్యాలెంట్ తో తెలుగులో అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం ఉన్న దర్శకులు మల్టీ టాలెంట్ ఉన్న అందగత్తెల కోసం వేటుకు తున్నారు.
ఈ మలయాళీ బ్యూటీ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో టైటిల్ సాంగ్ పడింది.
ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ అయ్యి ఈ బ్యూటీ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో ఆకలేస్తే అన్నం పెడతా.సాంగ్ కూడా పడింది.తర్వాత రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.తన నటనతో అదరగొట్టి శబాష్ అనిపించుకుంది.
ఈ సినిమా హిట్ తర్వాత చాలా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ ఆ వచ్చిన అవకాశాలు పెద్దగా ఆమె కెరీర్ కు ప్లస్ అవ్వలేదు.
వెంకటేష్ తో తీసిన చింతకాయల రవి, నాగార్జునతో తీసిన కేడి సినిమాలు హిట్ అవ్వక పోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది.మలయాళం, తమిళంలో హిట్ అయినా తెలుగులో మాత్రం సక్సెస్ ట్రాక్ అవ్వలేదు.ఆ తర్వాత ఆమెకు కాన్సర్ రావడంతో అసలు నటనకు మొత్తమే దూరమైంది.కాన్సర్ ను జయించి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
ఈమె తెలుగులో మాత్రం మళ్ళీ సినిమా చేయలేదు.తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఈ మల్లు బ్యూటీ.
ఈ అమ్మడు డైరెక్ట్ తెలుగు సినిమాతో కాకుండా లాల్ భాగ్ అనే త్రిభాషా చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి మెగాస్టార్ నుండి పిలుపు అందినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాబోయే రోజుల్లో మెగా సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్స్ అందుతాయేమో వేచి చూడాల్సిందే.