Karan Brahmastra : ఆ సినిమా నష్టాలతో కరణ్ సూసైడ్ అటెంప్ట్ చేశారా.. వైరల్ అవుతున్న న్యూస్!

బాలీవుడ్ యాక్టర్, జర్నలిస్టుగా పేరు సంపాదించుకున్న కమల్ ఆర్ ఖాన్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంటారు.ఇకపోతే తాజాగా ఈయన ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Did Karan Attempt Suicide Due To The Loss Of That Film The News Is Going Viral ,-TeluguStop.com

కరణ్ నిర్మాణంలో వచ్చిన ఓ సినిమా భారీ నష్టాలను ఎదురుకోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారంటూ చేసినటువంటి ట్వీట్ బి టౌన్ మీడియాలో సంచలనం రేపుతుంది.

అలియా భట్ రణబీర్ కపూర్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి సరైన విజయాన్ని అందుకోలేక పోయిందని, ఈ సినిమా ద్వారా కరణ్ జోహార్ భారీగా నష్టపోయారని కమల్ వెల్లడించారు.ఈ నష్టాలు కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేయబోయారంటూ ఈయన చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై ఇప్పటికైనా కరణ్ దివాలా తీసానని ఒప్పుకోవడం మంచిదని కమల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Alia Bhatt, Attempt, Ayan Mukherjee, Brahmastra, Kamal Khan, Karan, Karan

ఈ విధంగా బ్రహ్మాస్త్ర సినిమా కారణంగా నష్టాలు రావడంతో కరణ్ ఆత్మహత్యాయత్నం ప్రయత్నించడం ఏంటి అని పలువురు పెద్ద ఎత్తున ఈ విషయంపై భారీ స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే ఈ వార్తలపై కరణ్ స్పందించాల్సి ఉంది.ఇకపోతే బ్రహ్మాస్త్ర సినిమాను రెండు భాగాలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రావడంతో త్వరలోనే రెండో భాగం షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం పలు చర్చలకు దారి తీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube