ఆ సినిమా చేస్తున్నప్పుడు కంగనాకు కాలు విరిగిందా.. అయ్యో ఇన్నాళ్లు చెప్పనేలేదే?

బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే.నటిగా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

 Did Kangana Break Her Leg While Making That Movie-TeluguStop.com

ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి నటిగా నిలిచింది.ఇదిలా ఉంటే ఓ సినిమా చేస్తున్నప్పుడు కంగనా కాలు విరిగిందట.ఇంతకు ఏమైందో అసలు ఎలా జరిగిందో తెలుసుకుందాం.

 Did Kangana Break Her Leg While Making That Movie-ఆ సినిమా చేస్తున్నప్పుడు కంగనాకు కాలు విరిగిందా.. అయ్యో ఇన్నాళ్లు చెప్పనేలేదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2004లో ఐ లవ్ యు బాస్ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కంగనా రనౌత్.ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది.అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించింది.

ఏక్ నిరంజన్ సినిమా తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

అందులో తను వెడ్స్ మను సినిమాలో నటించింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ షూటింగ్ సమయంలో కంగనా రనౌత్ కు కాలు బెనకడం తో కింద పడిపోయిందట.

అయితే వెంటనే సినీ బృందం డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయించారట.ఎంతకు కాలు నొప్పి తక్కువ అవ్వకపోవడంతో హాస్పిటల్ కి తరలించారట.

అయితే హాస్పిటల్ లో ఎక్స్ రే చేయించడంతో తన కాళ్ళ ఎముకల్లో పగుళ్ళు కనిపించడంతో తనకు వెంటనే సిమెంట్ కట్టు కట్టి చికిత్స చేశారట.ఇక కంగనాకు సినిమా షూటింగ్ సమయంలో అలా అవ్వడంతో సినిమా షూటింగ్ వాయిదా వేశారట.

ఇక కంగనాకు రెండు వారాల వరకు రెస్ట్ అవసరమని ఆ తర్వాత కూడా క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు తెలిపారట.

Telugu Actress, Bollywood, Break Her Leg, Film Industrey, Kangana Ranauts-Movie

ఇక దర్శక నిర్మాతలు సినిమా మధ్యలో ఆగిపోవడంతో బాగా టెన్షన్ పడ్డారట.తర్వాత కంగనా మామూలు స్థితికి వచ్చాక మిగతా సినిమా షూటింగ్ పూర్తి చేశారట.అలా ఆమె కాళ్ళకు గాయమైన విషయం అప్పట్లో చాలా మందికి తెలియక పోగా ప్రస్తుతం ఈ విషయం మళ్ళీ వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు కంగనాకు కాళ్ళు విరిగిన విషయం ఇన్నాళ్లు చెప్పలేదు ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు.

కంగనా ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.

అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా ఓ రియాల్టీ షో చేయనుంది.ఇటీవలే ఈ షో గురించి కొన్ని అధికారిక ప్రకటనలు కూడా చేశారు.

ఇక ఈ షో ఇంగ్లీషు అని ఇంగ్లీష్ వర్షన్ నుండి ఈ షో ను తీసుకున్నారని తెలిసింది.అంతేకాకుండా ఇది డేటింగ్ కు సంబంధించినట్లు గతంలో ప్రకటించారు.

దీంతో ఈ షోలో కంగనా వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనుందట.పైగా ఈ షోకు భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకోనుందని తెలిసింది.

ఇక తలైవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

#Industrey #Break #Kangana Ranauts #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube